ఫిబ్రవరి నెల నడుస్తోంది ఇంకా. శివరాత్రి కూడా అవ్వలేదు కానీ ఎండలు మాత్రం దంచేస్తున్నాయి. సాయంత్రాలు, ఉదయం ఏడు వరకు చల్లగా ఆహల్ాదంగానే ఉంటున్నా ఏడు తర్వాత మాత్రం ఎండలు గట్టిగానే బాదుతున్నాయి.
11 తర్వాత బయటకు వెళ్ళేవారికి చుక్కలే కనిపిస్తున్నాయి. ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే ముందు ముందు ఎలా ఉంటుందో అని భయంగా ఉంది. లాస్ట్ మూడేళ్ళుగా కొంచెం వేసవి తక్కువగానే ఉందని చెప్పాలి.
వర్షాలు కూడా ఎక్కువగానే పడ్డాయి. మే నెలలో కొంచెం ఎండలు దంచినా దానికి ముందు, వెనుక మాత్రం పెద్దగా ఇబ్బంది పెట్టలేదు.
కానీ ఈ సారి అలా ఉండదని అనిపిస్తోంది. దానికి తగ్గట్టే అమెరికా వాతావరణ రిసెర్చ్ సెంటర్ కూడా ఈ సారి మండే ఎండలు ఖాయం అంటూ ప్రకటించింది.
అసలు గత మూడు, నాలుగేళ్ళుగా వాతావరణం చాలా అసాధారణంగా ఉంటోంది. ఎప్పుడు ఏమవుతుందో తెలియకుండా. చలికి చలీ విసరీతంగా ఉంటోంది, వానలూ ఎక్కువే పడుతున్నాయి.
ఇదంతా గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్. అయితే ఎండలు మాత్రం కొంచెం తక్కువగా ఉండి లా నినా పరిస్థితి ఉంది. కానీ ఈ సారి మాత్రం ఎల్ నినో పరిస్థితులు ఉండచ్చని అమెరికా వాతావరణ సంస్థలు అంటున్నాయి.
అసలేంటీ ఎల్ నినో, లా నినో?
భూమధ్య రేఖ చుట్టూ ఉండే సముద్రం దగ్గర ఉష్ణోగ్రతలు సడెన్గా పెరిగితే దాన్ని ఎల్ నినో అంటారు. ఇది వర్షాల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది.
అంటే సముద్రం ఉపరితలం మీద ఉష్ఱోగ్రలు పెరిగితే వర్షాలు తక్కువ లేదా అసలు పడకపోయే అవకాశాలు ఉంటాయి. అదే సముద్రం ఉపరితలం మీద ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటే దాన్ని లా నినో అంటారు.
అప్పుడు వర్షాలు ఎక్కువగా పడతాయి. లాస్ట్ త్రీ ఇయర్స్ గా లా నినో పరిస్థితులే ఉన్నాయి. కానీ ఈ సారి అలా ఉండకపోవచ్చని అంటున్నారు అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫరిక్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు.
జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఎల్ నినో పరిస్థితులు ఉంటాయి. దానివల్ల నైరుతి రుతుపవనాలు ఎఫెక్ట్ అయి వర్షాలు తక్కువగా పడతాయి. వర్షాలు పడకపోతే ఎండలు తగ్గే అవకాశమే ఉండదు. కాబట్టి ఈ సారి లాంగ్ సమ్మర్ ఉంటుంది.
ఎన్ఓఏఏ వాళ్ళు చెప్పింది ప్రాథమిక రిసెర్చ్ లో వచ్చిన అంచాలు మాత్రమే. వాతావరణం మన చేతుల్లో ఉండదు. అది ఎప్పుడూ మారుతూనే ఉంటుంది.
కాబట్టి రానున్న మూడు, నాలు నెలల్లో పరిస్థితులు మారొచ్చని కూడా చెబుతున్నారు. అప్పుడు దాని బట్టి జూన్ తర్వాత వర్షాలు పడతాయా, లేదా అనేది తెలుస్తుందని అంటున్నారు.
ఒకవేళ ఎల్ నినో పరిస్థితులే ఉంటే వేసవి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల కంటే ఎక్కువే ఉండొచ్చు. ఉత్తర, వాయువ్య, తూర్పు ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు కూడా రావచ్చని భారత వాతావరణ సంస్థ చెబుతోంది. కాబట్టి ఎండలను దృష్టిలో పెట్టుకుని దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తోంద
0 Comments:
Post a Comment