Success: వేయి మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలుపెడతాం. జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే అకుంఠిత దీక్ష, పట్టుదల కావాలి. స్వాతంత్ర్య పోరాటంలో మహాత్మాగాంధీ కూడా ఒక్కరే అయినా వెనుకాడలేదు.
ఆంగ్లేయులను తరిమికొట్టారు. మనం జీవితంలో ఎదగాలంటే భయపడకూడదు. ఎవరు తోడు ఉన్నా లేకపోయినా ఒంటరిగానైనా అనుకున్నది సాధించే వరకు విశ్రమించకూడదు. అలుపు రానేకూడదు.
పైకి ఎదగాలంటే కావాల్సింది క్రమశిక్షణ, పట్టుదల, సాధించాలనే తపన ఉంటే సరిపోతుంది.
Success
భవిష్యత్ పై ఆశలతో..
చీకటిని చూస్తూ తిట్టుకునే కంటే ఆ చీకటిలో చిరుదీపం వెలిగించడం మంచిది అనేది చైనా సామెత. గతాన్ని గుర్తు చేసుకుని బాధపడేకంటే భవిష్యత్ పై ఆశలు పెంచుకోవడం మానుకోవద్దు. రేపటి గురించి ఆలోచిస్తేనే మనకు ఆలోచనలు చిగురిస్తాయి.
అంచనాలు తలెత్తుతాయి. అంతేకాని గతాన్ని తవ్వుకుంటే అలా చేయకపోతే బాగుండు అనుకుంటే అక్కడే ఉంటాం. ముందుకు వెళ్లలేం.
తెలివైన వాడి లక్షణం ఏంటంటే భవిష్యత్ పై బంగారు కలలు కనండి. వాటిని సాకారం చేసుకునే దిశగా అడుగులు వేయండి.
ఫలితం గురించి తొందర వద్దు
భగవద్గీతలో శ్రీకృష్ణుడు పని చేయి కాని ఫలితం ఆశించకు. నీ కర్తవ్యం నీవు నెరవేర్చు. దాని వల్ల వచ్చే ఫలితం గురించి తొందరపడకు. నిదానంగా అదే వస్తుంది. పదవికి, పరిణయానికి తొందరపడకూడదని చెబుతున్నట్లు పని చేసిన తరువాత కూడా ఫలితం కోసం గాబరా పడొద్దు.
దాని ఫలితం మెల్లగా నీ సొంతమవుతుంది. ఎక్కడ కూడా నీ ప్రయత్నం ఆపకు. పని చేసుకుంటూ వెళ్లిపోవడమే నీ వంతు. దాని ఫలితం తరువాత క్రమంలో వస్తుంది. దాని గురించి బెంగ పెట్టుకోవద్దు.
మళ్లీ ప్రయత్నించాలి
ఒకసారి అపజయం కలిగితే కుంగిపోవద్దు. దాని నుంచి గుణపాఠం నేర్చుకుని మళ్లీ ప్రయత్నించాలి. ఐన్ స్టీన్ 999 సార్లు ప్రయత్నించి విఫలమై వెయ్యోసారి విజయం సాధించాడు. అంటే తాను అన్ని సార్లు తప్పు చేశానని గుర్తించాడు.
అలా మనం కూడా మన ప్రయత్నాన్ని ఆపొద్దు. విజయం సాధించే వరకు విశ్రమించకూడదు. అలుపు లేకుండా పోరాడితేనే విజయం సిద్ధిస్తుంది.
విజయం నీ పాదాక్రాంతమవుతుంది. అపజయానికి కుంగిపోకూడదు. విజయానికి పొంగిపోకూడదు. రెండింటిని సమపాళ్లుగా చూసుకోవాలి.
ఇతరులతో పంచుకోవద్దు
అనుకున్నది సాధించేందుకు ఎలాంటి రిస్క్ కైనా వెనకాడకూడదు. ఎంత కఠినమైన అడ్డంకులు వచ్చినా విజయమే లక్ష్యం కావాలి. విజయం కోసం నిరంతరం సాధన చేయాలి.
మన భావోద్వేగాలు, అభిప్రాయాలను ఇతరులతో పంచుకోకూడదు. మన విషయాల్లో ఇతరుల జోక్యం కల్పించుకోకుండా చూడాలి. ఎవరు ఎన్ని చెప్పినా వినకుండా మన పని మనమే చేసుకోవాలి.
దాని కోసమే శ్రమించాలి. విజయం సిద్ధించే వరకు విరామం అవసరం లేదని గుర్తించాలి. దాని కోసం అహర్నిశలు ఆలోచనలు సాగాలి.
Success
ఈర్ష్యాద్వేషాలకు అతీతంగా..
ఇతరులు సాధించిన విజయాలను చూసి ఈర్ష్య పడకూడదు. మంచి ఎవరు చేసినా మంచే. ఎవరు విజయం సాధించినా ప్రశంసించాలి. కానీ హేళన చేయకూడదు. మనం కూడా కష్టపడాలని భావించాలి.
అందుకనుగుణంగా మార్గాలను అన్వేషించుకోవాలి. ఏ పని చేయడానికైనా వెనకాడకూడదు. వంకలు చెప్పకూడదు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.
మన చేతుల్లో లేని వాటి కోసం సమయం వృథా చేసుకోకూడదు. తెలిసిన వాటిని వదిలేయకూడదు. ఇలా విజయం సాధించేందుకు నిరంతరం మన వంతు కృషి చేస్తే సరి.
0 Comments:
Post a Comment