Students Fight: రణరంగంగా మారిన ప్రభుత్వ పాఠశాల.. ఓ వర్గం విద్యార్థులపై మరో వర్గం దాడి..
గుంటూరు జిల్లాలో విద్యార్థులు రణరంగం సృష్టించారు. ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థుల మధ్య చిన్న వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. టెన్త్ క్లాస్ విద్యార్థుల మధ్య తలెత్తిన గొడవ ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది.
స్కూల్ విద్యార్థులే కాని.. కాలేజీ స్టూడెంట్స్‌కు మించి రెచ్చిపోయారు. ఓ వర్గంవారిపై మరో వర్గంవారు విచక్షణ రహితంగా దాడి చేశారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం చిన్నకొండ్రుపాడు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో పరీక్ష రాస్తున్న మరో వర్గం వారిని చితక బాదారు విద్యార్థు తరఫు బంధువులు. ఈ ఘటనలో నలుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి.
కర్రలు రాడ్లతో స్కూల్ ప్రహరీ గోడ దూకి స్కూల్ లోకి ప్రవేశించి ఎగ్జామ్స్ సెంటర్లో ఉన్న విద్యార్థులను కొట్టిడం ఆందోళనకు దారితీసింది. ఇదేంటి అని ప్రశ్నించిన టీచర్లను సైతం లెక్కచేకుండా ఆ విద్యార్థుల తరపు బంధువులు దాడి చేశారు.
అక్కడి సీన్ చూస్తున్న వారు షాక్‌కు గురయ్యారు. ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందో తెలియక మిన్నకుండిపోయారు. పదుల సంఖ్యలో వచ్చిన విద్యార్థులు వారి బంధువులు మరో వర్గంవారిని కొట్టడంతో ఆ ప్రాంతం భయానకంగా మారింది. ఘటనపై పోలీసులు అప్రమత్తమయ్యారు. దాడులకు పాల్పడిన విద్యార్థులు.. వారి బంధువులపై చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు.
0 Comments:
Post a Comment