Umngot River : ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో ఉన్న ఉమన్‌గోట్ నది..
సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యింది. ఇక్కడి నీరు గ్లాసులా స్పష్టంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి చేరుకుంటారు. (image credit - twitter - @iAmitRajawat)
ఉమన్‌గోట్ నదిని దాకీ నది అని కూడా అంటారు. ఇది 15 అడుగుల లోతు వరకు ఉంది. అయినప్పటికీ లోపలున్న రాళ్ళు నదిపై ప్రయాణించేవారికి అత్యంత స్పష్టంగా కనిపిస్తాయి. (image credit - twitter - @PiyushGoyal)
ఇండియా - బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలో ఉంది ఈ నది. భారతీయ, బంగ్లాదేశ్ మత్స్యకారులకు ఇది ప్రధాన గమ్యస్థానంగా ఉంది. ఈ నది వెండిలా ప్రకాశిస్తుంది కాబట్టి ప్రజలు దీనికి ఆకర్షితులవుతారు. (image credit - twitter - @swami2005)
నదిలో వెళ్తున్న పడవను చూస్తుంటే.. అది నీటిపై వెళ్తున్నట్లు అనిపించదు. గాలిలో తేలియాడుతున్నట్లు కనిపిస్తుంది. నదిలో నీరు చాలా శుభ్రంగా ఉంటుంది. చాలా పారదర్శకంగా ఉంటుంది. దిగువన ఉన్న ప్రతి గులకరాయూ స్పష్టంగా కనిపిస్తుంది. (image credit - twitter - @ColoursOfBharat)
ప్రపంచం నలుమూలల నుంచి ప్రతి సంవత్సరం వేల మంది పర్యాటకులు ఇక్కడకు వచ్చి నది అందాలు చూస్తారు. పరిసరాల ఆసక్తికర దృశ్యాలను ఆస్వాదిస్తారు. ఈ ప్రదేశం దాదాపు ప్రతి సీజన్‌లో పర్యాటకులతో రద్దీగా ఉంటుంది. ముఖ్యంగా వసంతకాలంలో పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. (image credit - twitter - @dipshreeee)
కొన్నిసార్లు ఇక్కడ బోట్ రైడ్ పోటీలు కూడా జరుగుతాయి. ఈ పోటీలలో విజేతకు నగదు లేదా తాజాగా పట్టుకున్న చేపలను బహుమతిగా ఇస్తారు. (image credit - twitter - @ColoursOfBharat)
0 Comments:
Post a Comment