భారతదేశ సంప్రదాయాలు, పద్ధతులు చాలా లోతైనవి. వందల ఏళ్లుగా కొనసాగుతున్నాయి. ఎంతగా అంటే ఈ సంప్రదాయాలు, పద్ధతులు చాలా పురాతన కాలం నుండి ఆధునిక యుగం వరకు ఆచరణలో ఉన్నాయి.
వాటిని విస్మరించడానికి లేదా తక్కువ చేయడానికి అవకాశం లేదు. తినే ముందు నీటిని చల్లడం పురాతన భారతీయ ఆచారం. దాని వెనుక కారణం, ప్రయోజనాలు ఉన్నాయి.
చాలా మంది ఇప్పటి తరం వాళ్లు కొన్ని పద్ధతులు కాలం చెల్లినవిగా భావిస్తారు. కానీ వాటి వెనక ఉండే అర్థం వాటికి ఉంటుంది. కొంతమంది ఈ ఆధునిక సమాజంలో పట్టించుకోరు.
కానీ పురాతన పద్ధతుల్లోనూ సైన్స్(Science) ఉంటుంది. ప్రత్యేకించి అలాంటి అభ్యాసం ఇతర వ్యక్తులను ప్రభావితం చేస్తుంది. అవి నేటికీ అమలులో ఉన్నాయి.
తినడానికి ముందు అరటి ఆకు చుట్టూ మూడుసార్లు వృత్తాకారంలో నీటిని చిలకరించడం అనేది పురాతన కాలం నుంచి వస్తుంది. ఈ అభ్యాసాన్ని మన చుట్టూ పెద్దవాళ్లు చేసేప్పుడు, సినిమాల్లోనూ కూడా చూశాం.
కానీ చాలా మందికి ఈ అలవాటు వెనక ఉన్న లోతైన కారణం తెలియదు. దాని ప్రయోజనాలు తెలియదు. దీని వెనక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
ఇలా నీళ్లు(Water) విస్తరు చుట్టూ చల్లడాన్ని 'చిత్రాహుతి' అని పిలుస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ పద్ధతి ఎక్కువగా కనిపిస్తుంది.
ముఖ్యంగా బ్రాహ్మణులలో ఇప్పటికీ ఉంది. ఈ అభ్యాసం ద్వారా ప్రజలు దేవతల నుండి దీవెనలు పొందుతారని ఓ నమ్మకం.
తమ ఆహారం చుట్టూ నీటిని చిలకరించినప్పుడు అది దేవునికి నైవేద్యాన్ని సమర్పించడం, మనం తినేందుకు ఆహారాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు అని సూచిస్తుంది.
కొన్ని సందర్భాల్లో భోజనం ప్రారంభించే ముందు దేవతలకు నైవేద్యంగా ఆహారంలో కొంత భాగాన్ని పక్కన పెట్టే పద్ధతి కూడా ఉంది.
ఈ పురాతన పద్ధతి వెనక లాజిక్ కూడా ఉంది. ఇది ప్రాచీన కాలంలో ఋషుల నుంచి వచ్చిందని నమ్ముతారు. ఋషులు తమ జీవితాలలో ఎక్కువ భాగం అటవీ ప్రాంతాలలో నివసించే వారు.
ఒక వేళ ఆశ్రమంలో ఉన్నా.. ఇప్పటిలాగా టైల్స్ లేవు కదా. అక్కడ అంతస్తులు, కాంక్రీటు ఉండదు కదా. నేల మీదే కూర్చొని ఆహారం తినే వారు. అంతేకాదు అరటి ఆకుల్లో ఆహారం ఎక్కువగా వడ్డించేవారు.
అయితే ఆహారం నేలకు తాకే అవకాశం ఉంది. అది అనారోగ్యకరమైనది. అందుకే మట్టి లేదా దుమ్ము రేణువులు లేచి అరటి ఆకులో పడకుండా.. చుట్టూ నీటిని చల్లేవారు.
చాలా మంది నమ్మే మరో కారణం ఏంటంటే, కీటకాల నుంచి దూరంగా ఉండేందుకు అని కూడా చెబుతారు. ముఖ్యంగా పురాతన కాలంలో రాత్రి సమయంలో కాంతి తక్కువ. మనలాగా వారికి లైట్స్ లేవు.
రాత్రి సమయంలో కాంతి తక్కువగా ఉన్నప్పుడు.. చీమలు లేదా కీటకాలు నీటిని దాటడానికి లేదా నీటిపై తొక్కడానికి ధైర్యం చేయవని కూడా నమ్ముతారు. అందుకే చుట్టూరా నీళ్లు చల్లుతారట.
నేటి కాలంలో మన జీవన విధానం, మన ఆహారపు అలవాట్లలో భారీ మార్పులు వస్తున్నాయి. ఈ పద్ధతి కొంతమందే పాటిస్తున్నారు. ఎక్కువ మందివి కాంక్రీట్ తో కట్టిన ఇళ్లే. డైనింగ్ టేబుల్ వద్ద కుర్చీపై కూర్చొని తినడానికి ఇష్టపడుతున్నారు.
ఇది కూడా ఈ పద్ధతి మరిచిపోయేందుకు ఓ కారణంగా ఉంది. కానీ ఏదో ఓ చోట.. ఎవరో ఒకరు అరటి ఆకు చుట్టూ.. నీళ్లు చల్లి తిన్నప్పుడు చూస్తే.. ఏదో తెలియని సంతోషం మాత్రం కలుగుతుంది.
0 Comments:
Post a Comment