వాషింగ్టన్: అమెరికాలో తరచూ టోర్నడోలు ఏర్పడుతుంటాయి. సుడులు తిరుగుతూ భూమ్యాకాశాలను ఏకం చేస్తుంటాయి.
వాటి పరిధిలోకి వెళ్లిన ఎలాంటి భారీ వస్తువులనైనా ఇట్టే ఎగరేసుకెళ్తాయి.
కనీసం గంటపాటు విధ్వంసాన్ని సృష్టిస్తుంటాయవి. అలాంటి టోర్నడోలు భగభగమండే సూర్యుడిపై ఏర్పడితే ఎలా ఉంటుంది? దాని వల్ల సంభవించే అనర్థాలు ఎలాంటివి? అనేది ఇప్పటివరకు తెలుసుకునే అవసరం శాస్త్రవేత్తలకు రాలేదు. ఇప్పుడా సందర్భం వచ్చింది
సూర్యుడిపై టోర్నడోలు..
సూర్యుడిపై భారీ టోర్నడోలు ఏర్పడినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ.. నాసా గుర్తించింది. గతంలో ఇలాంటివి ఎప్పుడూ చోటు చేసుకోలేదని స్పష్టం చేసింది.
ఇదివరకు సౌర తుఫాన్లు సంభవించినప్పటికీ- తాజాగా గుర్తించిన టోర్నడోల తీవ్రత ఎన్నో రెట్లు అధికంగా ఉన్నట్లు తేలింది. దీని ప్రభావం ఉపగ్రహాల పనితీరుపై పడుతుందని వెల్లడించింది. ప్రత్యేకించి- టెలి కమ్యూనికేషన్ల వ్యవస్థ ప్రభావితమౌతుందని పేర్కొంది.
జేమ్స్ వెబ్ రికార్డ్
సూర్యుడిపై సౌర తుఫాన్లు సహజమే అయినప్పటికీ- దీనికి భిన్నంగా అవి టోర్నడోల తరహాలో సంభవించడం నాసా శాస్త్రవేత్తలను నివ్వెరపరుస్తోంది. సూర్యుడి ఉత్తరధృవంలో 55 డిగ్రీల అక్షాంశం వద్ద ఈ టోర్నడోలు సంభవించాయి.
నాసాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్.. వీటిని రికార్డ్ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి డేటాను నాసా గ్రౌండ్ స్టేషన్ కు చేరవేసింది. దీనిపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తోన్నారు.
భారీ ఫలకలు విచ్ఛిన్నం..
అంటార్కికాలో భారీ మంచుఫలకలు ఏ రకంగా విరిగిపోతుంటాయో.. అలాంటిదే సూర్యుడి ఉత్తరధృవంలో చోటు చేసుకున్నట్లు నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. ఉత్తరధృవంలో ఉన్న భారీ ఫలకలు విచ్ఛిన్నం కావడం వల్ల టోర్నడోలు సంభవించినట్లు వివరించారు.
జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కంటికి చిక్కేలా ఇది ఉవ్వెత్తున ఎగిసిపడిందంటే- దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని డాక్టర్ టమిథ స్కోవ్ తెలిపారు. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ ను ఆమె తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.
శాటిలైట్స్ కు విఘాతం..
ఈ సోలార్ టోర్నడోల ప్రభావం ఉపగ్రహాలపై తీవ్రంగా పడుతుందని నాసా తెలిపింది. టెలికమ్యూనికేషన్లు, పవర్ గ్రిడ్ దీని ప్రభావానికి గురవుతాయని పేర్కొంది.
తాజాగా చోటు చేసుకున్నటువంటి టోర్నడోలు ఇక ముందు కూడా సంభవించే అవకాశాలు లేకపోలేదని అమెరికా నేషనల్ సెంటర్ ఫర్ అట్మాస్ఫెరిక్ రీసెర్చ్ సోలార్ అనలిస్ట్ స్కాట్ మెకింటోష్ చెప్పారు.
దీన్ని ఆరంభంగా భావిస్తున్నామని, మున్ముందు మరింత తీవ్రతతో అవి ఏర్పడవచ్చని వ్యాఖ్యానించారు.
0 Comments:
Post a Comment