థాయ్‌లాండ్‌లోని బ్యూంగ్ కాన్ ప్రావిన్స్‌లో ఉన్న నేషనల్ పార్క్‌లో మీరు నాగా కేవ్స్‌ను చూడవచ్చు.
నేషనల్ పార్క్‌లో మూడు పర్వతాల పొరలు ఉన్నాయి, ఇవి మెకాంగ్ నది వెంట విస్తరించి ఉన్నాయి. ఇక్కడ చాయ్ మోంగ్ కోన్ ఆలయంలో నుంచి ప్రయాణం ప్రారంభించాలి. ఆ తర్వాత రాతి మెట్లపైకి ఎక్కాలి. ఈ భాగం ఇరు వైపులా పాము చర్మాన్ని పోలినట్లు కనిపిస్తుంది. Photo: Twitter
ఈ మార్గం ద్వారా పైకి చేరుకుంటే ఓ ప్రదేశం వస్తుంది. ఈ ప్రదేశమే గుహకు స్టార్టింగ్ పాయింట్. ఆ దారిలోనే ముందుకు వెళితే నాగా గుహలకు చేరుకోవచ్చు. Photo: Twitter
ఈ శిలలు సుమారు లక్ష సంవత్సరాల క్రితం నాటివని అధికారుల చెబుతారు. ఈ నాగా గుహల వల్లే వర్షాలు పడుతాయని అక్కడి ప్రజలు నమ్ముతారు. Photo: Twitter
అంతేకాదు.. ఇది రాయిలా మారిపోయిన పాము అని అక్కడి ప్రజలు విశ్వసిస్తారు. ఓ యువరాజు, ఓ కన్య ఇందులోనే ఉండేవారని.. ఆ తర్వాత ఆమె నాగిగా మారి.. ఆ తర్వాత గుహగా మారిపోయిందని అక్కడి ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటారు. Photo from Love Silhouette/Shutterstock
0 Comments:
Post a Comment