*📌ఏలూరు స్కూలులో విద్యాశాఖ కమిషనర్ తనిఖీలు*
▪️హెచ్ఎంకు షోకాజ్ నోటీసు
🌻ఏలూరు ఎడ్యుకేషన్ /కలెక్టరేట్ ఫిబ్రవరి 23 :విద్యార్థుల సామర్ధ్యాలు నిర్ణీత ప్రమాణాలకనుగుణంగా లేకపోవడం, తరగతి గదిలో చెత్త చెదారం, నిర్వహణలోపం తదితర కారణాలతో ఏలూ రులోని పవర్పేట ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యా యునికి విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ ఆదేశాల మేరకు గురువారం షోకాజ్ నోటీసు జారీచేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ జిల్లా పరిశీలకునిగా నియమితులైన సురేష్ కుమార్ గురువారం ఏలూరు విచ్చేసిన నేపథ్యంలో నగరంలోని యూపీ స్కూలును ఆకస్మికంగా సందర్శించారు.
స్కూలులో నేరుగా విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించిన ఆయన తరగతికి అనుగుణంగా బాల బాలికల్లో విద్యా సామర్ధ్యాలు లేవని వాఖ్యా నించినట్టు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.
అనంతరం తరగతి గదుల్లో చెత్త ఉండటం, నిర్వహణ లోపం వంటివి గమనించిన కమిషనర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
స్కూలు హెచ్ఎంకు షోకాజ్ నోటీసు ఇవ్వాల్సిందిగా ఆదేశించారని జిల్లా విద్యాశాఖాధి కారి రవిసాగర్ తెలిపారు.
అనంతరం కలెక్టరేట్లో ఎంఈవోలు, సమగ్రశిక్ష ఏపీవోలు, డీవైఈవోలు, అర్బన్ పాఠశాలల తనిఖీ అధికారి, తదితరులతో విద్యా విషయాలపై సమీక్షించారు.
పదో తరగతి విద్యార్థుల కోసం మార్చినెలలో ప్రీఫైనల్ పరీక్షను నిర్వహించను న్నామన్నారు.
విద్యార్థులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్య అందించే దిశగా కృషి చేయాలన్నారు.
పోటీ ప్రపంచంలో తట్టుకునేలా బెస్ట్ క్వాలిటీ టీచింగ్ అందించా లన్నారు.
యూడైస్, నాడు-నేడు, తదితర అంశాలపై జిల్లాప్రగతిని అడిగి తెలుసుకున్నారు.
కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జేసీ అరుణ్ బాబు, డీఆర్డీఏ పీడీ, ఐసీడీఎస్ పీడీ పాల్గొన్నారు.
0 Comments:
Post a Comment