ఫిబ్రవరి 18న మహా శివరాత్రి. పరమేశ్వరుడు జ్యోతిర్లింగాకారం దాల్చిన రోజే.. శివరాత్రి. మాఘమాసములో కృష్ణ పక్ష చతుర్ధశి అర్ధరాత్రిని శివరాత్రిగా జరుపుకుంటారు.
హిందువులు భక్తి శ్రద్ధలతో జరుపుతున్న పండగల్లో ఈ పర్వదినం కూడా ఒకటి. శివరాత్రి రోజు శైవక్షేత్రాలన్నీ భక్తుల రద్దీతో కిటకిలాడుతుంటాయి. శివనామస్మరణతో మార్మోగుతుంటాయ.
ఐతే మన దేశంలో కాశ్మీర్ నుంచి కన్మాకుమారి వరకు ఎన్నో శివాలయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రం చాలా ప్రత్యేకమైనవి. ఇతర వాటితో పోల్చితే ఎంతో భిన్నమైనవి. సాధారణంగా శివాలయంలో కొబ్బరికాయ కొట్టి.. పండ్లు పూలు సమర్పిస్తుంటారు.
పంచామృత అభిషేకాలు చేస్తుంటారు. కానీ ఓ శివాలయంలో మాత్రం శివుడికి మద్యాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. దేవుడి విగ్రహానికి మద్యాన్ని తాగిస్తారు. ఇది మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉంది. పేరు కాల భైరవ దేవాలయం.
ఉజ్జయిని నగరానికి 8 కిలోమీటర్ల దూరంలో కాల భైరవ ఆలయం ఉంటుంది. ఆలయ పూజారులు ప్రతిరోజూ ఉదయం 6:00 గంటలకు కాలభైరవ దేవాలయం తలుపులు తెరుస్తారు. ఉదయం 7:00 నుండి 8:00 గంటల వరకు హారతి ఇస్తారు.
బాబా కాల భైరవ్‌ని దర్శించుకునేందుకు నిత్యం వేలాది భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు. ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే.. ఇక్కక దేవుడికి మద్యాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు.
ఆలయ ప్రాంగణంలో ఎక్సైజ్ శాఖ అనుమతి ఉన్న మద్యం దుకాణాలు ఉంటాయి. ఆలయాల్లో కొబ్బరి కాయలు, పూలు, ఇతర వస్తువులను అమ్మే దుకాణాలతో పాటు మద్యం దుకాణాలు కనిపిస్తాయి. భక్తులంతా మద్యం సీసాలను కొనుగోలు చేసి దర్శనానికి వెళ్తారు.
ఆలయ పూజారులు వారి నుంచి సీసాలను తీసుకొని.. సగం సీసా వరకు.. కాలభైరవుడికి తాగిస్తారు. మిగతా సగం సీసాను భక్తులకు తిరిగి ఇచ్చేస్తారు. ఆ మద్యాన్ని భక్తులు నైవేద్యంగా తీసుకుంటారు.
తమ వారి కోసం ఇళ్లకు తీసుకెళ్తారు. ఇలా చేయడం వల్ల రోగాల నుంచి విముక్తి లభిస్తుందని.. పాప వినాశనం జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.
ఆలయ పూజారులు ఓ గిన్నెలో మద్యం పోసి.. దానిని దేవుడి పెదాల వద్ద ఉంచుతారు. దానిని శివుడు స్వీకరిస్తాడని భక్తులు నమ్ముతారు. ఇలా కాల భైరవ్ రోజుకు 2000 కంటే ఎక్కువ బాటిళ్ల మద్యం తీసుకుంటాడట.
ఐతే ఆ విగ్రహం నుంచి మద్యం ఎక్కడికి వెళ్తుందన్నది ఇప్పటికీ ఎవరికీ తెలియదు. అది అంతు చిక్కని రహస్యం. ఎంతో మంది శాస్త్రవేత్తలు, ప్రభుత్వ విభాగాలు దీనిపై పరిశోధన చేశాయట. కానీ ఏమీ తేల్చలేకపోయారట.
టూర్ ప్యాకేజీ..">
ఈ కాల భైరవుడు ఉజ్జయిని నగర క్షేత్ర పాలకుడు. పూర్వ కాలంలో తాంత్రిక పూజలు జరిగేవట. కాల భైరవుడిని పంచ మకారాలు.. అంటే మాంసం, మద్యం, మత్స్యం, మంత్రం, మైథునంతో ప్రార్థిస్తే.. కోరిన కోరికలు నెరవేరుతాయని పూర్వ కాలం నుంచీ విశ్వాసముంది.
ఐతే కాలక్రమేణా... అందులో కొన్నింటిని పాటించడాన్ని ఈ ఆలయంలో నిలిపివేశారు. కానీ మద్యాన్ని నైవేద్యంగా సమర్పించడం మాత్రం అలాగే కొనసాగుతూ వస్తోంది.
0 Comments:
Post a Comment