Rules to drink tea: ఈ టైంలో పొరపాటున కూడా టీ తాగకండి.. తారకరత్నకు ట్రీట్మెంట్ ఇస్తున్న నారాయణ హృదయాలయ డాక్టర్ చెప్పిన పచ్చి నిజం ఇది..!
పొద్దున లేచి లేవగానే వేడి వేడి టీ గొంతులో పడితే ఆ రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. లేదంటే తల పట్టుకు కూర్చొనే వాళ్లు ఎంత మంది లేరు చెప్పండి.
అసలు చెప్పాలంటే ఉదయానికి పర్యాయపదమే టీ. మనం టీతో అంతలా కనెక్ట్ అయిపోయాం. భూమ్మీద అమృతం అంటే టీనే అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. ఇక కాలక్రమేణ టీలో చాలా మార్పులు వచ్చాయి. పసుపు టీ, గ్రీన్ టీ, కడక్ ఛాయ్, మసాలా టీ, హెర్బల్ టీ అంటూ బోలెడన్ని రకాలు వచ్చేశాయి. ఇక ఈ టీలలో కొన్ని మనకు ఆరోగ్య పరంగా చాలా సహాయపడతాయి. బ్లాక్ టీ, గ్రీన్ టీలు ఫ్యాట్‌ను కట్ చేయడంలో సహాయపడతాయి. హెర్బల్ టీ వచ్చేసి రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహకరిస్తుంది. మితంగా టీ తాగడం వలన వచ్చే ఇబ్బందేమీ లేదు. పైగా శక్తిని పెంచుతుంది. అలాగే గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కానీ ఓ సినిమాలో రజినీ కాంత్ చెప్పారే.. భోజనం మితంగా తీసుకుంటే ఔషధం.. అమితంగా తీసుకుంటే విషమని.. ఇది టీకి కూడా వర్తిస్తుంది. టీని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆందోళన పెరుగుతుంది. నిద్రలేమి, గుండెల్లో మంట వంటి రకరకాల ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. టీని సమయానుసారంగా మాత్రమే తీసుకోవాలి. అలాగే ఖాళీ కడుపుతో టీ తీసుకోవడం ఏమాత్రం సమంజసం కాదని నిపుణులు చెబుతున్నారు.
ఏ టైంలో టీ తాగకూడదనే విషయమై తారకరత్నకు ట్రీట్మెంట్ ఇస్తున్న నారాయణ హృదయాలయ సీనియర్ క్లినికల్ డైటీషియన్ శృతి భరద్వాజ్ కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. ఉదయం లేదా సాయంత్రం టీ తీసుకోవడం వల్ల వచ్చే ముప్పేమీ లేదు కానీ అల్పాహారంలో లేదా భోజనంతో పాటు టీ తీసుకోకుండా ఉండటం మంచిదని భరద్వాజ్ చెప్పారు. అయితే జెన్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ డైటీషియన్ ప్రియా పాలన్ మాత్రం అల్పాహారంతో పాటు టీ తీసుకుంటే ఇబ్బందేమీ లేదని పేర్కొన్నారు.
ఖాళీ కడుపుతో టీ తాగవచ్చా?
టీలో యాసిడిటీకి దోహదపడే టానిన్లు ఉంటాయి. ఒక వ్యక్తికి ఎసిడిటీ తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం ఖాళీ కడుపుతో ఎట్టి పరిస్థితుల్లోనూ టీ తీసుకోవద్దు. ఆ సమయంలో పాలు తీసుకోవడం మేలని ప్రియా పాలన్ వెల్లడించారు.
ఆరోగ్యకరమైన టీలు
భోజనం చేసిన తర్వాత వేడి వేడి కప్పు టీ లాగించేద్దాం అనుకుంటే మాత్రం హెర్బల్ టీని ట్రై చేయండి. ఇవి మనకు చాలా యాక్టివ్‌గా పని చేసేందుకు సహకరిస్తాయి. మంచి విశ్రాంతిని కలిగిస్తాయి.
రోజులో ఎన్ని కప్పుల టీ తాగాలి?
రోజులో 2 - 3 కప్పుల టీ తాగడం మేలని నిపుణులు చెబుతున్నారు. అలాగే నిద్రపోయే ముందు మాత్రం టీని అవాయిడ్ చేయడం ఉత్తమం.
టీ తాగేటప్పుడు చేయాల్సినవేంటి? చేయకూడనివేంటి?
టీని ఎక్కువసేపు మరిగించవద్దు. ఇలా మరిగించడం వల్ల టీ దాని ప్రయోజనాలను కోల్పోతుంది.
పాలు, పంచదార ఎక్కువగా వేయకూడదు. టీలోని రియల్ ఎసెన్స్ అనేది పాలు, పంచదారను జోడించకుండానే సాధ్యమవుతుంది. ఒకవేళ పాలు తప్పని సరిగా పోయాల్సిందే అనుకుంటే మాత్రం మరిగిన డికాషన్‌లో వేడి పాలు వేసి వెంటనే గ్యాస్ ఆఫ్ చేయండి. ఎక్కువగా మరిగించవద్దు.
టీ బ్యాగులను ఉపయోగించవద్దు. బదులుగా టీ ఆకులను ఉపయోగించండి.
మీరు రాత్రిపూట టీ తాగాలనుకుంటే.. రాత్రి 8:30 గంటలకు తాగడం ఉత్తమం. ఎందుకంటే ఈ సమయంలో మన జీర్ణక్రియ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. మన ఆహార జీవక్రియలో సహాయపడటానికి కెఫీన్‌ను అదనంగా తీసుకోవచ్చు.
మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో టీ తాగడం వల్ల మనకు చాలా మేలు జరుగుతుంది. ఎందుకంటే ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఫ్లూ, జలుబులను నివారిస్తుంది.
0 Comments:
Post a Comment