How To Relieve Constipation In 5 Minutes: ప్రస్తుతం చాలా మంది రాత్రిపూట ఆలస్యంగా తినడం, నూనె పదార్థాలు ఎక్కువగా తినడం, చెడు అలవాట్ల కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు.
ముఖ్యంగా చాలా మంది మలబద్ధకం, అజీర్ణం వంటి తీవ్ర పొట్ట సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఎక్కువగా అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
వేసవి కాలం కారణంగా చాలా మంది ఇలాంటి సమస్యలకు లోనవుతారు. అయితే ఇలాంటి క్రమంలో ఆరోగ్య నిపుణులు సూచించిన పెరుగు, అరటి పండు మిశ్రమాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మిశ్రమాల ద్వారా అనారోగ్య సమస్యలకు ఎలా చెక్ పెట్టొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
మలబద్ధకం నుంచి ఉపశమనం:
చాలా మంది ఎండకాలంలో ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా అల్పాహారంలో అరటిపండు, పెరుగు తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ రెండు ఆహారాలు మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇది మలబద్ధకం సమస్యను దూరం చేయడమేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఎప్పుడు పెరుగు-అరటిపండు తినాలో తెలుసా?:
అరటిపండు, పెరుగు కలిపి తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. పెరుగులో శరీరానికి కావాల్సిన మంచి బ్యాక్టీరియా అధిక పరిమాణంలో లభిస్తుంది.
అంతేకాకుండా ఇందులో విటమిన్లు, కాల్షియం, ఖనిజాలు కూడా లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజూ పెరుగును తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
అంతేకాకుండా అరటిపండులో ఐరన్, విటమిన్స్, ఫైబర్ ఉంటాయి. వీటిని కలుపుకుని ప్రతి రోజూ తినడం వల్ల శరీరానికి పొట్ట సమస్యలు సులభంగా దూరమవుతాయి.
రెట్టింపు ప్రయోజనాలు:
అరటిపండ్లను ఆహారంగా తీసుకుంటే శరీరం కూడా దృఢంగా మారుతుంది. అంతేకాకుండా వీటిలో ఫైబర్, మంచి బ్యాక్టీరియా ఉండడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి శరీరానికి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఎముకలు కూడా దృఢంగా తయారవుతాయి.
0 Comments:
Post a Comment