RBI Monetary Policy 2023
RBI Monetary Policy 2023: సొంతింటి కల నెరవేర్చుకుందామనుకుంటున్న మధ్య తరగతి ప్రజలకు గృహ రుణం భారంగా మారుతోంది.
కొన్ని నెలలుగా రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లు పెంచుకుంటూ పోతోంది. దీంతో బ్యాంకులు ఆ భారాన్ని నేరుగా రుణ గ్రహీతలపైనే వేస్తున్నాయి.
దీంతో ఇప్పటికే రుణం తీసుకున్నవారు గగ్గోలు పెడుతుండగా, రుణం తీసుకుని ఇళుల కట్టుకోవాలనుకుంటున్నవారు పునరాలోచనలో పడ్డారు. వడ్డీరేటు తక్కువగా ఉంది కదా అని ఇళ్లు కొనుక్కున్న వారిని దివాలా అంచుకు చేర్చేస్తోంది.
ద్రవ్యోల్బణం కట్టడి పేరుతో..
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా పెరుగుతున్న ద్రవ్యోల్బణం కట్టడి పేరుతో వరుసగా రెపో రేట్లు పెంచుకుంటూ పోతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే ఆరుసార్లు రెపోరేటు పెంచింది.
ప్రతీ రెండు నెలలకోసారి రుణాలపై వడ్డీరేట్లు పెంచుకుంటూ పోతోంది. దీంతో 6 నుంచి 7 శాతం మధ్య ఉన్న బ్యాంకు రుణాల వడ్డీ రేటు ఇప్పుడు 9 నుంచి పది శాతానికి చేరింది.
ఇంకా పెంచే అవకాశం..
ఇప్పటికే మధ్య తరగతి ప్రజలు పెరుగుతున్న వడ్డీ రేట్లతో కుదేలవుతున్నారు. అయినా మోదీ సర్కార్.. వడ్డీ రేటు మరింత పెంచుతుందన్న సంకేతాలు వస్తున్నాయి.
దీంతో తక్కువ రుణం తీసుకున్న వారు కూడా లక్షల్లో తిరిగి చెల్లించాల్సి వస్తంది. ఫలితంగా కరోనా తర్వాత సొంత ఇళ్లు ఉండాలని ఆవేశపడిన వారందరికీ ఇప్పుడు ఏడుపు ఒక్కటే తక్కువ.
కరోనాతో సొంతింటిపై ఆసక్తి..
కరోనాతో చాలామంది ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా అద్దె ఇళ్లలో ఉన్నవారికి కరోనా వస్తే ఇళ్లు ఖాళీ చేయించిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సొంత స్థలం ఉన్నవారు చిన్నగా అయినా ఇళ్లు కట్టుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఇందుకోసం బ్యాంకు రుణాలకు వెళ్లారు. కరోనా సమయంలో కనీవినీ ఎరుగనంత తక్కువ వడ్డీరేట్లు ఉన్నాయంటూ బ్యాంకర్లు ఊదరగొట్టి జనాలను ఇళ్ల వైపు నడిపించారు. ఈఎంఐలు తక్కువే పడుతాయి కదా అని ఎక్కువ మంది రిస్క్ తీసుకున్నారు.
కానీ ఇప్పుడు అటు వడ్డీ.. ఇటు ఈఎంఐ కూడా భరించలేనంతగా పెరిగింది. నెలంతా కష్టపడి అందుకున్న సంపాదనలో పెద్ద మొత్తం రుణదాతలకే ఇవ్వాల్సిన దుస్థితి ఏర్పడింది. వాహన, విద్య, వ్యక్తిగత రుణాలపైనా ఈ వడ్డీ భారం ఎక్కువగానే ఉంది.
సాధారణంగా 20 ఏళ్లు, అంతకంటే తక్కువ కాలపరిమితి ఉన్న గృహ రుణగ్రహీతలకు నెలనెలా చెల్లించే ఈఎంఐ భారంలో ఎలాంటి మార్పూ కనిపించకపోవచ్చు. 30 ఏళ్ల్లకు మించి ఈఎంఐ చెల్లింపుల కాలపరిమితి పెంచే మార్గం లేనప్పుడు ఈఎంఐ విలువను ఎప్పటికప్పుడు పెంచుతున్నాయి బ్యాంకులు.
RBI Monetary Policy 2023
పాత రుణాలపై కొత్త వడ్డీ ఏమిటి?
ద్రవ్యోల్బణం తగ్గించాలంటే.. ఎప్పుడో ఖర్చు పెట్టి కొనుక్కున్న వాటి మీద వడ్డీరేట్లు పెంచడం ఎందుకన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇది ఆర్థిక నిపుణులకు కూడా అంతుబట్టడం లేదు.
కొత్తగా ఇచ్చే రుణాలకు మాత్రమే అది వర్తింప చేస్తే రుణాలు అవసరం ఉన్నవారు తీసుకుంటారు. కానీ ఎప్పుడో తీసుకున్న రుణాలపై కూడా బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచడం మధ్యతరగతి ప్రజలకు గుదిబండగా మారుతోంది.
ఇప్పటికే ఒకవైపు పన్నుల మీద పన్నులు కడుతున్న వారు.. ఇప్పుడీ వడ్డీ బాదుడుతో.. మోదీజీ ఏ క్యాహే అని ప్రశ్నిస్తున్నారు. బ్యాంకర్ల నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు.
0 Comments:
Post a Comment