ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసినా ప్రాసెస్ చేసిన ఫుడ్స్ విరివిగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే వీటిని తీసుకుంటే, ప్రమాదం బారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అంతేకాదు ముసలితనం కూడా చాలా త్వరగా వస్తుందని, క్యాన్సర్ సహా పలు వ్యాధులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ప్రాసెస్ చేసిన ఆహారాల్లో ఎక్కువగా పెద్ద ఎత్తున నిల్వ ఉంచేందుకు రసాయనాలను వాడుతూ ఉంటారు.
ఇది హార్మోన్లను ప్రభావితం చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా కూల్ డ్రింకులు, ప్యాక్ చేసిన చిరుతిళ్లు, అలాగే పలు రకాల స్నాక్స్, చీజ్, ప్రాసెస్డ్ క్రీం, బటర్ వంటివి తీసుకోవడం ద్వారా జబ్బుల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముసలితనం త్వరగా వస్తుంది: ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల వయసు పైబడిన వారిగా కనిపిస్తారు. ఇటీవలి అధ్యయనం ప్రకారం, ప్రాసెస్ చేసిన ఆహారం ,పెరుగుతున్న వయస్సుకు మధ్య సంబంధం ఉందని తేలింది.
అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో చక్కెర, నూనెలు, పిండి పదార్థాలు, కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువ రోజులు తీసుకోవడం వల్ల వయసు పైబడిన వారిలా కనిపిస్తారు.
ప్రతిరోజూ ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల వయస్సును పెంచేక్రోమోజోమ్ టెలోమియర్ ను ప్రోత్సహిస్తుంది. బదులుగా పండ్లు, కూరగాయలతో కూడిన ఆహారం తీసుకుంటే దీర్ఘకాలిక అనారోగ్యాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
2020లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు చక్కెర, ఉప్పు, కొవ్వు , పిండి పదార్ధాలతో నిండి ఉంటాయి. వాటిని తీసుకోవడం ద్వారా, మీరు నడి వయస్సు నుచే వృద్ధులుగా కనిపించడం ప్రారంభిస్తారు.
ఊబకాయం:ప్రాసెస్డ్ ఫుడ్‌లో ఉండే కృత్రిమ చక్కెర ఊబకాయం సమస్యను పెంచుతుంది. కొన్నిసార్లు వీటి వినియోగం దీర్ఘకాలిక వ్యాధులను కూడా ఆహ్వానించవచ్చు.
ప్రాసెస్ చేసిన ఆహారాలలో చక్కెరను ఎక్కువగా ఉపయోగిస్తారు. కార్న్ సిరప్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్, సుక్రోజ్, మాల్టోస్ లాంటి ఇతర చక్కెరలను కూడా ఉండవచ్చు. రోజువారీ ఆహారంలో 10 శాతానికి మించిన చక్కెరలు శరీరానికి హానికరం.
మెటబాలిక్ సిండ్రోమ్: ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల్లో మెటబాలిక్ సిండ్రోమ్‌తో కూడా సంబంధం కలిగి ఉంటుంది. ఇది అనేక ప్రమాద కారకాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది గుండె జబ్బులు , టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. మెటబాలిక్ సిండ్రోమ్ వంటి అనేక సమస్యలకు దారితీస్తుంది.
ఇన్‌ఫ్లమేటరీ బౌల్ సిండ్రోమ్:ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే ఇన్‌ఫ్లమేటరీ బౌల్ సిండ్రోమ్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. దీనిని క్రోన్ వ్యాధి లేదా అల్సరేటివ్ కొలిటిస్ అని కూడా అంటారు.
ప్రాసెస్ చేసిన ఆహారాలలో ఉండే రసాయనాల ప్రభావంతో వల్ల ఈ వ్యాధి వస్తుంంది. ఉదాహరణకు, బ్రెడ్, పీనట్ బటర్, కేక్ మిక్స్‌లు, సలాడ్ డ్రెస్సింగ్‌లు, సాస్‌లు, పెరుగు, పుడ్డింగ్, ప్రాసెస్ చేసిన చీజ్, ఐస్ క్రీం , డెజర్ట్‌లు మొదలైన ప్రాసెస్ ఫుడ్స్ అదే పనిగా తింటే ఇన్‌ఫ్లమేటరీ బౌల్ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం ఉంది.
కొలొరెక్టల్ క్యాన్సర్: ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినడం వల్ల కొలొరెక్టల్ (కడుపులో) క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. మీరు ప్యాక్డ్ లేదా ప్రాసెస్ చేసిన నాన్-వెజ్, బేకన్, సాసేజ్, హాట్ డాగ్ మొదలైనవి తినడం వల్ల క్యాన్సర్ పెరిగే అవకాశం ఉంది.
ముఖ్యంగా నాన్ వెజ్ పదార్థాలను నిల్వ ఉంచేందుకు రసాయనాలను ఉపయోగిస్తారు. మీరు ప్రతిరోజూ 50 గ్రాముల ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకుంటే, కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 18% పెరుగుతుంది.
0 Comments:
Post a Comment