Post Office Bumper Offer: రూ.250తో ఖాతా.. రూ.25లక్షల బెనిఫిట్.. పోస్టాఫీస్ బంపర్ ఆఫర్..
ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబోతున్న AMRTPEX-2023 (జాతీయ స్థాయి స్టాంపుల ప్రదర్శన) లో భాగంగా ఈ ఫిబ్రవరి 9, 10వ తేదీల్లో సమృద్ధి యోజన అకౌంట్ మేళా నిర్వహించబోతున్నట్లు తపాలా శాఖ పేర్కొంది.
తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లాల్లో సుకన్య సమృద్ధి ఖాతాలు తెరిచేందుకు అవకాశం కల్పించినట్లు పేర్కొంది. మొత్తం 7.5 లక్షల ఖాతాలను తెరవడమే లక్ష్యంగా ఈ మేళా నిర్వహించనునట్లు చెప్పారు. సుకన్య సమృద్ధి యోజన పథకంపై ప్రస్తుతం 7.6 శాతం చక్రవడ్డీ లభిస్తుందని తెలిపారు. పోస్టాఫీసుల్లో కేవలం రూ.250తో ఖాతా తీసుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
అంతే కాకుండా.. ఖాతాలో జమైన మొత్తం సొమ్ము మీద ఆదాయపు పన్ను మినహాయింపు పొందవవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
అందువల్ల ఉద్యోగం చేసే వారికి ఈ స్కీమ్ చాలా అనువుగా ఉండనుంది. సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‌లో చేరాలని భావించే వారు తల్లి లేదా తండ్రి పాన్ కార్డు, ఆధార్ కార్డు మరియు రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు , పాప బర్త్ సర్టిఫికెట్ వెంట తీసుకొని వెళ్లాలి. (ప్రతీకాత్మక చిత్రం)
ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఖాతా ద్వారా ఆన్ లైన్ లో నగదు జమ చేసుకునే సౌకర్యం కూడా ఉంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ స్కీమ్‌లో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
అంటే నెలకు రూ.12,500 వరకు డిపాజిట్ చేయొచ్చు. ఉదాహరణకు మీరు నెలకు రూ. 5 వేలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో రూ.25 లక్షలకు పైగా వస్తాయి. సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ తెరిచిన తర్వాత 15 ఏళ్ల పాటు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూనే వెళ్లాలి. (ప్రతీకాత్మక చిత్రం)
తర్వాత డబ్బులు కట్టాల్సిన పని లేదు. సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ మెచ్యూరిటీ కాలం 21 ఏళ్లు. అమ్మాయికి 18 ఏళ్లు వచ్చిన తర్వాత కొంత డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. 21 ఏళ్ల తర్వాత పూర్తి డబ్బులు పొందేందుకు ఈ స్కీమ్ రూపొందించబడింది. (ప్రతీకాత్మక చిత్రం)
పోస్టాఫీసు ఖాతాల్లోనే అత్యధిక వడ్డీ రేటు లభిస్తున్న పథకం ఇదే. ప్రతి మూడు నెలలకు ఒక సారి కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను సమీక్షిస్తూ ఉంటుంది. అందువల్ల వడ్డీ రేట్లు పెరగొచ్చు. లేదంటే తగ్గొచ్చు. కొన్ని సందర్భాల్లో వడ్డీ రేట్లు నిలకడగా కూడా కొనసాగవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
0 Comments:
Post a Comment