Phone Early Morning : ఉదయం నిద్ర లేచిన వెంటనే ఫోన్‌ను చూస్తున్నారా.. అయితే ఏం జరుగుతుందో తెలిస్తే.. ఇకపై అలా చేయరు..!
Phone Early Morning : ప్రస్తుత కాలంలో సెల్ ఫోన్ లవినియోగం రోజురోజుకు ఎక్కువవుతుందనే చెప్పవచ్చు. వయసుతో సంబంధం లేకుండా అందరూ వీటిని ఉపయోగిస్తున్నారు.
స్మార్ట్ ఫోన్ లేని వారు ఈ రోజుల్లో ఉండరటే అది అతిశయోక్తి కాదు. చాలా మంది ఒకటి కంటే ఎక్కువ ఫోన్ లనే ఉపయోగిస్తున్నారు. సోషల్ మీడియా, మూవీస్, గేమ్స్ అంటూ సగానికి పైగా సమయాన్ని సెల్ ఫోన్ లల్లోనే గడిపేస్తున్నారు. చాలా మంది వారివారి రోజును సెల్ ఫోన్ చూడడంతోనే ప్రారంభిస్తున్నారు. ఉదయం లేచిన వెంటనే సమయాన్ని చూడడం కోసం, ఆలారాన్ని ఆఫ్ చేయడానికి అని తీసుకున్న ఫోన్ ను చూస్తూనే ఉంటారు. కొందరు నిద్ర లేచిన వెంటనే సెల్ ఫోన్ ను చూడడం ప్రారంభిస్తారు. మెయిల్స్, సోషల్ మీడియా, వార్తలను చూడడం కోసం ఫోన్ ను తీసుకుని చూస్తూ ఉంటారు. ఇలా ఉదయం లేచిన వెంటనే సెల్ ఫోన్ ను చూడడం వల్ల అనేక ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఉదయం లేచిన వెంటనే సెల్ ఫోన్ ను చూడడం వల్ల తీవ్రమైన కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అప్పటి వరకు విశ్రాంతి తీసుకున్న కళ్లపై ఒకేసారి తీవ్రమైన కాంతిపడడం వల్ల కళ్లపై ఎక్కువగా ఒత్తిడి పడుతుంది. రోజూ ఇలాగే చూస్తూ ఉండడం వల్ల కంటికి సంబంధించిన అనేక రకాల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే ఉదయం లేచిన వెంటనే ఫోన్ ను చూడడం వల్ల అందులో ఏదైనా చెడు వార్తలు ఉండవచ్చు. దీంతో మనం ఒత్తిడికి గురి అవుతాము. ఈ ఒత్తిడి కారణంగా బీపీ, గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఉదయం లేచిన వెంటనే సెల్ ఫోన్ చూడడం వల్ల అందులో ఆఫీస్ నుండి వచ్చే మెయిల్స్ ఉండవచ్చు. దీంతో మీరు ఆఫీస్ కు వెంటనే చేరుకోవాలనే ఉద్దేశ్యంతో ఎక్కువ వేగంతో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తారు.
Phone Early Morning
దీంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఉదయం నిద్ర లేచిన వెంటనే సోషల్ మీడియా చూడడం వల్ల మనం ఇతరులతో పోల్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో మనలో నిరుత్సాహం మొదలవుతుంది. ఒత్తిడి పెరుగుతుంది.మన రోజంతా ఆందోళనగా గడిపేస్తాము. కనుక మనం సాధ్యమైనంత వరకు ఉదయం లేచిన వెంటనే సెల్ ఫోన్ ను చూడకపోవడమే మంచిది. మనం కొన్ని జాగ్రత్తలను తీసుకోవడం వల్ల ఉదయమం లేచిన వెంటనే సెల్ ఫోన్ చూసే అలవాటును దూరం చేసుకోవచ్చు. దీని కోసం మనం రాత్రి పడుకునేటప్పుడే మన గదిలో సెల్ ఫోన్ లు, ఎలక్ట్రానిక్ వస్తువులు లేకుండా చేసుకోవాలి. అలాగే సెల్ ఫోన్ లల్లో అలరాన్ని పెట్టడానికి బదులుగా అలారం ఉండే గడియారాలను కొనుగోలు చేయాలి. దీంతో మనం ఉదయం లేచిన వెంటనే సెల్ ఫోన్ ను చూసే అవకాశం ఉండదు.
అలాగే ఉదయం యోగా, ధ్యానం, వ్యాయామం వంటివి చేయాలి. ఇలా చేయడం వల్ల మనం రోజంతా ఉత్సాహంగా, ఆనందంగా ఉండవచ్చు. అలాగే నిద్ర లేచిన వెంటనే ఈ రోజంతా ఏమి చేయాలో చక్కగా వ్రాసుకోవాలి. అలాగే రోజూ ఉదయం సెల్ ఫోన్ ను చూడడానికి బదులుగా చక్కటి అల్పాహారం తినడానికి ప్రయత్నించాలి. దీంతో మనం రోజంతా నీరసపడకుండా ని చేసుకోవచ్చు. ఈ అలవాట్లు మొదట చేయడానికి ఇబ్బందిగా ఉన్న క్రమక్రమంగా అలవాటవుతాయి. ఈ జాగ్రత్తలను పాటించడం వల్ల మనం రోజూ ఉదయాన్నే సెల్ ఫోన్ ను చూడకుండా ఉంటాము. దీంతో మనం మళ్లీ నిద్రించే వరకు పాజిటివ్ ఎనర్జీతో ఉండవచ్చు.
0 Comments:
Post a Comment