స్మార్ట్‌ఫోన్ వినియోగం ప్రస్తుతం చాలా పెరిగింది. ముఖ్యంగా ప్రతి ఇంట్లో రెండు నుంచి మూడు స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను తరచూ వేధించే సమస్య చార్జింగ్.
ఎక్కడకు వెళ్లినా ముందు మొబైల్ చార్జింగ్ కోసం చూస్తూ ఉంటాం. అదే ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్తే కచ్చితంగా పవర్ బ్యాంక్ మనతో ఉండేలా చూసుకుంటాం.
అయితే ఈ సమస్య నుంచి రక్షణకు స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఎక్కువ పవర్ ఉన్న బ్యాటరీలను ఇవ్వడం స్టార్ట్ చేశాయి. అయినా కూడా సమస్య మాత్రం పూర్తిగా సమసిపోలేదు. అయితే ఫోన్ బ్యాటరీ రక్షణకు తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? నిపుణులు ఫోన్ వాడుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నారు.
ముఖ్యంగా ఫోన్ చార్జింగ్ విషయంలో మనం చేసే చిన్నతప్పు ఫోన్ పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. నిపుణులు సూచించే మార్గాలు ఏంటో ఓ సారి చూద్దాం.
ఫాస్ట్ చార్జర్ వినియోగం
కస్టమర్లను ఆకట్టుకోడానికి ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ కంపెనీలన్నీ ఫాస్ట్ చార్జర్ల అందిస్తున్నాయి. ఫోన్ స్పీడ్‌గా చార్జ్ అవ్వడంతో అంతా వాటినే వినియోగిస్తున్నారు.
అయితే ప్రతిరోజు వాటి వినియోగం ఫోన్ పనితీరును దెబ్బతీస్తుందని నిపుణులు అంటున్నారు. కనీసం వారంలో మూడు రోజులైనా స్లో చార్జర్ చార్జ్ చేసుకుంటే బ్యాటరీపై ఒత్తిడి తగ్గి బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది.
5 శాతం కంటే తక్కువకు బ్యాటరీను ఖాళీ చేయడం
చాలా మంది పని ఒత్తిడితో ఫోన్ చార్జింగ్ పెట్టడం మర్చిపోతుంటారు. దీంతో ఫోన్ చార్జింగ్ 5 శాతం కంటే తక్కువకు పడిపోతుంది. ఒక్కోసారి చార్జింగ్ లేక స్విఛ్ ఆఫ్ అయ్యిపోతుంటుంది. వెంటనే చార్జింగ్ పెడుతుంటాం.
అది బ్యాటరీ లైఫ్‌పై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి బ్యాటరీ 15-20 శాతం ఉన్నప్పుడే చార్జింగ్ పెట్టడం ఉత్తమమని సూచిస్తున్నారు.
ఫోన్ కేస్‌తో చార్జింగ్ పెట్టడం
మనలో చాలా మంది ఫోన్ చార్జింగ్ పెట్టే సమయంలో ఫోన్‌కు ఉన్న కేస్‌తో చార్జింగ్ పెడుతుంటాం. ఇలా చేయడం ద్వారా బ్యాటరీ వేడెక్కిపోయి బ్యాటరీ పనితీరును చెడగోడుతుంది.
అలాగే చార్జింగ్ కనెక్టర్‌ను కూడా విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది. మొదట్లో కనెక్టర్ ప్రభావం పడనప్పటికీ క్రమేపి కనెక్టర్‌ను చెడిపోయేలా చేస్తుంది. కాబట్టి ఫోన్ చార్జింగ్ చేసే సమయంలో కేస్ తీసి చార్జింగ్ పెట్టడం ఉత్తమం.
0 Comments:
Post a Comment