జీవితంలో ప్రతి ఒక్కరి వ్యక్తిత్వం భిన్నంగా ఉంటుంది. తినడం, నడవడం, పని చేయడం, ఎవరితోనైనా మాట్లాడటం లేదా రాయడం వంటి ప్రతి పనిలో వారి వారి వ్యక్తిత్వంలో భిన్నత్వం ఉంటుంది.
అయితే ఒకరి వ్యక్తిత్వం తాను మొబైల్‌ను పట్టుకున్న విధానం ద్వారా కూడా తెలుసుకోవచ్చు అని మీకు తెలుసా. దీని గురించి సైకాలజీలో ఆసక్తికర వివరాలు పేర్కొనడం జరిగింది. మరి ఫోన్ పట్టుకునే విధానంతో వ్యక్తిత్వాన్ని ఎలా అంచనా వేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఒక చేత్తో పట్టుకుని, మరో వేలితో స్క్రోల్ చేస్తూ..
మొబైల్ ఫోన్ ఒక చేత్తో పట్టుకుని మరో చేతి వేలితో స్క్రోల్ చేసే వారికి భిన్నమైన ఆలోచనలు ఉంటాయి. వారు ప్రకృతికి దాసోహం అవుతారు. వ్యక్తిగత జీవితంలో కాస్త సిగ్గుపడతారు.
సామాజికంగా ఉన్నప్పటికీ, వీరు ఏకాంతంలో ఉండటానికి ఇష్టపడతాడు. వీరి ఊహలు వైవిధ్యమైనవి. వారు కెరీర్‌ని ఏ విధంగా చేయాలనుకున్నా విజయం సాధిస్తారు.
మరో చేత్తో ఫోన్‌ని స్క్రోల్ చేస్తూ..
చాలా మంది వ్యక్తులు ఫోన్‌ని ఒక చేత్తో పట్టుకుని, మరో చేత్తో బొటనవేలుతో స్క్రోల్ చేస్తారు. అలాంటి వ్యక్తులు చాలా జాగ్రత్తగా, అన్ని విషయాలను అవగాహన చేసుకుంటారు.
ఇలాంటి వ్యక్తులు సంబంధాలను కొనసాగించడంలో నమ్మదగినవారు. నిజాయితీ కలిగిన వారు. వారు విషయాలను మంచి మార్గంలో పరిశీలించగలరు. దీర్ఘంగా ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు. డేటింగ్ కోసం భాగస్వామిని గుర్తించడంలో వీరి తెలివితేటలు అద్భుతమైనవి.
రెండు బ్రొటనవేళ్లను తెరపై ఉంచేవారు..
మొబైల్ ఫోన్‌ని రెండు చేతులతో పట్టుకుని రెండు బొటనవేళ్ల సహాయంతో ఆపరేట్ చేసే వ్యక్తులు సాంకేతిక పరిజ్ఞానం, వినూత్న ఆలోచనలు కలిగి ఉంటారు.
తన వ్యక్తిగత జీవితంలో చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉంటారు. పరిస్థితి ఎలా ఉన్నా.. ఎలా జీవించాలో, దాని నుండి ఎలా బయటపడాలో వారికి బాగా తెలుసు. వీరు చాలా త్వరగా కొత్త విషయాలను స్వీకరిస్తారు. అలాంటి వారికి ఛాలెంజ్ అంటే చాలా ఇష్టం.
ఒక చేత్తో ఫోన్ పట్టుకుని రన్ చేసేవారు..
ఫోన్‌ను ఒక చేత్తో పట్టుకుని బొటనవేలుతో స్క్రోల్ చేసే వారు నమ్మకంగా ఉంటారు. వీరు కొత్త విషయాలను స్వీకరించడానికి భయపడరు.
కంఫర్ట్ జోన్ నుండి బయటపడటం ద్వారా చాలా పనులు చేయగలరు. అలాంటి వ్యక్తులు సంతోషంగా ఉంటారు.
జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటారు. ఒత్తిడి లేని జీవితాన్ని ఇష్టపడతారు. అలాంటి వారికి జీవితంలో ఏది లభించినా దానిని తేలిగ్గా స్వీకరిస్తారు
0 Comments:
Post a Comment