ఇంట్లో తల్లిదండ్రుల మధ్య చాలా సార్లు రకరకాల విషయాల్లో గొడవలు జరుగుతుంటాయి. కొంతమంది తల్లిదండ్రులు ఈ విషయంలో చాలా తెలివిగా వ్యవహరిస్తారు. తమ వైరుధ్యాలను పిల్లల ముందు బయటకు రానివ్వరు.
కాగా కొందరు తల్లిదండ్రులు మాత్రం తెలియక పిల్లల ముందు గొడవ పడుతుంటారు. ఇలా చేయడం వల్ల పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల ప్రతికూలంగా ప్రభావితమై డిప్రెషన్‌లోకి వెళ్లిపోతారు.
తల్లిదండ్రుల ఇటువంటి ప్రవర్తన వల్ల పిల్లలు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటారో పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పిల్లలు నిరాశలో మునిగిపోతారు..
ఎప్పుడైతే తల్లిదండ్రులు పిల్లల ముందు అరవడం, కొట్లాడుకోవడం మొదలుపెడతారో అప్పుడే పిల్లలు నిరాశలో మునిగిపోతారు.
వారు తల్లి లేదా తండ్రి వైపు వెళ్లలేరు. ఇది వారి నమ్మకాన్ని వమ్ము చేస్తోంది. వారు మునుపటి కంటే ప్రశాంతంగా ఉండలేరు. పిల్లల్లో కూడా చిరాకు వస్తుంది.
మానసికంగా కృంగిపోతారు..
తల్లిదండ్రుల గొడవల వల్ల పిల్లలు మానసికంగా కుంగిపోతారు. తమ ఇంట్లో పరిస్థితులు బాగోలేదని వారు నిరాశకు లోనవుతారు. వారికి నిద్రపట్టడంలో ఇబ్బందులు మొదలవుతుంది. ఎప్పుడూ ఆ గొడవల గురించే ఆలోచిస్తూ ఉండిపోతారు. ఇది వారి ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది.
తల్లిదండ్రులతో చిరాకుగా ఉంటారు..
తల్లిదండ్రులు నిత్యం ఘర్షణ పడటం వల్ల.. పిల్లల్లో వారిపట్ల అగౌరవ భావాలు పెరుగుతాయి. వారు తమ తల్లిదండ్రులు గౌరవించడం మానేస్తారు. తల్లిదండ్రుల పట్ల ప్రతికూల ఆలోచనలు పెరుగుతాయి. ఇది వారి మనసును తీవ్రంగా గాయపరుస్తుంది. పిల్లలు తమ తల్లిదండ్రులపై విసుగుచెందుతారు.
ఆహారం పట్ల ఆసక్తి తగ్గుతుంది..
తల్లిదండ్రుల పిల్లల ముందు రోజూ గొడవపడటం వల్ల పిల్లల మనసులో తిండి తినడం మానేస్తారు. మనసులో ఆహారం పట్ల ఆసక్తి తగ్గుతుంది.
వాళ్లు తిన్నా కూడా అయిష్టంగానే తింటారు. తల్లితండ్రుల ఒత్తిడితో నోటిలో ఆహారం పెట్టుకున్నా సరిగ్గా నమలకుండానే మింగేస్తారు. ఇలా తినే ఆహారంపై వారిలో ఆసక్తి తగ్గుతుంది.
0 Comments:
Post a Comment