Pan Card Misuse: మీ పాన్ కార్డ్ దుర్వినియోగమవుతోందా ?..ఇలా తెలుసుకోండి.. వీరికి ఫిర్యాదు చేయండి
పాన్ కార్డ్ ఒక ముఖ్యమైన ప్రభుత్వ పత్రం.
ఇది అనేక ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు. బ్యాంకులో ఖాతా తెరవడం నుంచి ఆర్థిక లావాదేవీల వరకు పాన్ కార్డు తప్పనిసరి. ఇప్పుడు పాన్ కార్డు దుర్వినియోగానికి సంబంధించి అనేక వార్తలు వస్తున్నాయి. ఇందులో ఏ వ్యక్తికైనా ఆధార్, పాన్ కార్డు ద్వారా నకిలీ రుణాలు తీసుకుంటున్నారు దుండగులు. అటువంటి పరిస్థితిలో మీ పాన్ కార్డ్ దుర్వినియోగం చేయబడలేదా అనేది తెలుసుకోవడం ముఖ్యం. (ప్రతీకాత్మక చిత్రం)
దుండగులు మీ పాన్ కార్డును రుణం తీసుకోవడానికి, క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడానికి, తప్పుడు మార్గాల్లో ఆభరణాలు కొనుగోలు చేయడానికి ఉపయోగించవచ్చు. మీ పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డు తప్పు వ్యక్తి చేతిలో ఉంటే, అతను మీ పేరు మీద రుణం తీసుకోవచ్చు. ఈ రకమైన మోసాన్ని అమలు చేయడానికి, ముందుగా మీ వ్యక్తిగత సమాచారం దొంగిలించబడుతుంది.(ప్రతీకాత్మక చిత్రం)
బ్యాంకు ఖాతా తెరవడానికి, స్టాక్ మార్కెట్‌లో వ్యాపారం చేయడానికి ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి, రుణం తీసుకోవడానికి, ఆస్తి కొనుగోలు వంటి వాటికి పాన్ కార్డు ఎంతో అవసరం.(ప్రతీకాత్మక చిత్రం)
అయితే ఇంట్లో కూర్చొని పాన్ కార్డ్ లావాదేవీ చరిత్రను తెలుసుకోవచ్చు. ఇందుకోసం క్రెడిట్ స్కోర్‌ను తనిఖీ చేయడం. మీరు దీన్ని TransUnion CIBIL, Equifax, Experian, Paytm, Bank Bazaar, CRIF High Mark మొదలైన వెబ్‌సైట్ నుండి తనిఖీ చేయవచ్చు. ముందుగా సంబంధిత వెబ్‌సైట్‌ను తెరవండి. కొన్ని వెబ్‌సైట్‌లు వివరణాత్మక క్రెడిట్ స్కోర్ కోసం డబ్బు వసూలు చేస్తాయి.(ప్రతీకాత్మక చిత్రం)
మీరు పుట్టిన తేదీ, ఇమెయిల్ ఐడి, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు పాన్ కార్డ్ నంబర్‌తో కూడిన కొంత సమాచారాన్ని కూడా ఇవ్వాలి. మొబైల్ నంబర్‌పై OTP వస్తుంది, దానిని నమోదు చేయండి. దీని తర్వాత మీరు మీ స్వంత క్రెడిట్ స్కోర్‌ను చూడగలరు. దీన్ని బట్టి మీ పాన్‌ను దుర్వినియోగం చేయడం లేదా అనేది తెలుస్తుంది.(ప్రతీకాత్మక చిత్రం)
మీ పాన్ కార్డ్ దుర్వినియోగం చేయబడితే, మీరు ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్ https://incometax.intelenetglobal.com/pan/pan.aspని సందర్శించడం ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
0 Comments:
Post a Comment