PAN Card: వినియోగదారులకు అలర్ట్.. నిరూపయోగంగా మారనున్న 13 కోట్ల పాన్ కార్డులు.. ఎందుకు..?
ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలంటే పాన్‌కార్డు తప్పనిసరి. పాన్ బ్యాంకు ఖాతా తీయడం నుంచి ఆర్థిక లావాదేవీలు జరిపేందుకు తప్పకుండా కావాల్సిందే.
ఆధార్ కార్డులాగానే పాన్ కార్డు కూడా ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారిపోయింది. దీనిని ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ జారీ చేస్తుంది. అయితే పాన్‌కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలని ఇప్పటికే కేంద్రంతో పాటు ఆదాయపు పన్ను శాఖ కూడా పదేపదే చెబుతూ వస్తోంది. ఇప్పుడు పాన్‌కార్డు ఉన్నవారికి ఇది కీలక అప్‌డేట్. నిర్లక్ష్యం చేస్తే మీ పాన్‌కార్డు శాశ్వతంగా రద్దయ్యే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ అత్యవసర నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం కోట్లాది పాన్ కార్డులు నిరుపయోగం కానున్నాయి. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) చైర్‌పర్సన్ నితిన్ గుప్తా మీడియా సమావేశంలో ఈ సమాచారం అందించారు.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ తెలిపిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా ఉన్న 61 కోట్ల పాన్ కార్డుల్లో ఇప్పటి వరకూ 48 కోట్లమందే మాత్రమే తమ పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేశారు. ఇంకా 13 కోట్లమంది పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాల్సి ఉంది. మార్చి 31,2023లోగా పాన్‌కార్డును ఆధార్‌తో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే విధించిన గడువు ముగిసినందున పెనాల్టీ ఛార్జీలతో అనుసంధానం చేసుకోవాలి. లేకపోతే మీరు బ్యాంకు లావాదేవీలు, ఇతర వ్యాపార కార్యకలాపాలు కొనసాగించలేరు. ఇప్పటి వరకు పాన్‌కార్డు ఉన్నవారు ఆధార్ కార్డుతో అనుసంధానించకపోతే వెంటనే పూర్తి చేసుకోవడం మంచిది. మార్చి 31 తేదీలోగా ఈ పని పూర్తి చేయకుంటే మీ పాన్ కార్డు నిరూపయోగంగా మారే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేయని వారు మార్చి 31లోగా రూ.1000 పెనాల్టీ చెల్లించి చేసుకోవాల్సి ఉంటుంది.
0 Comments:
Post a Comment