Pak: ఉగ్రవాద బీజాలు నాటింది మేమే! భారత్‌లో ఎప్పుడూ ఇలా జరగలేదన్న పాక్
పాముకు పాలు పోస్తే విషం కక్కుతుంది కాని పాలను కక్కదు కదా.! ఈ విషయం పాకిస్థాన్‌కు ఎన్ని సార్లు తెలిసివచ్చినా దండగే. ప్రతిసారీ ఉగ్రవాద దాడులు జరగడం..
అమాయకుల ప్రాణాలు పోవడం అక్కడ సర్వసాధారణమైపోయింది. పెషావర్- ఖైబర్ పఖ్తుంఖ్వాలోని మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడి ఇదే విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది. ఈ దాడిలో మృతుల సంఖ్య ఇప్పటికే వంద దాటేసింది. 170మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రతిసారీ లాగే దాడి జరిగిన తర్వాత పాక్ తన పాత డైలాగులనే మరోసారి చెప్పింది.
ఉగ్రవాద బీజాలు నాటింది మేమే:పాక్
తమ దేశం ఉగ్రవాద బీజాలు నాటిందన్నారు పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఎక్కువ సేపు మాట్లాడబోనని.. అయితే మొదట్లో ఉగ్రవాద బీజాలు వేసింది మనమేనన్న విషయం మరవద్దన్నారు. పెషావర్‌లోని మసీదు ఆవరణలో తనను తాను పేల్చుకున్న ఉగ్రవాది.. ప్రార్థనల సమయంలో అక్కడే ముందు నిలిబడి ఉన్నాడన్నారు. భారత్‌లో కానీ, ఇజ్రాయెల్‌లో కానీ ప్రార్థనల సందర్భంగా ఇలా ఎప్పుడూ జరగలేదని.. అయితే పాకిస్థాన్‌లో మాత్రం తరుచుగా ఇలాంటివి జరుగుతుండడం బాధాకరమన్నారు ఆసిఫ్.పెషావర్ మసీదు పేలుడుకు ఎవరు బాధ్యత వహిస్తారని ఆసిఫ్ ప్రశ్నించారు.
పాక్ ఇప్పటికైనా మారు
ప్రపంచంలోని పలు ఉగ్రవాద సంస్థలకు పాక్ అడ్డా. మన దేశంపై కూడా ఎప్పటికప్పుడు ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ ఉంటుంది. ఇక ఎప్పుడూ తమ దేశం ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం లేదని బుకాయిస్తూనే ఉంటుంది. అయితే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రం పాశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ ఉంటుంది. నిజానికి సామ్రాజ్యవాద దేశాల ఆధిపత్య ధోరణి, గొంతెమ్మకోర్కెలే ప్రపంచ వ్యాప్తంగా ఇస్లామిక్ స్టేట్ లాంటి ఉగ్రవాద సంస్థల పుట్టుకకు కారణమవుతున్నాయి. పాక్ ఎప్పుడో ఇలా బలి పశువుగా మారిపోయింది. ఉగ్రవాదానికి పాలు పోసి పెంచింది. అయితే చాలా సందర్భాల్లో ఆ ఉగ్రవాదమే అక్కడి అమాయకుల ప్రాణాల్ని బలి తీసుకుంది. ఉగ్రవాద సమస్యమూలాలు తెలిసిన పాక్ వాటిని అలానే కొనసాగిస్తూ వస్తోంది. ఉగ్రవాదం పేరులో పొరుగు దేశంపై సైనిక దాడులకు ఉపక్రమించడం పాక్ నైజం.
0 Comments:
Post a Comment