Oversleeping Side Effect: మంచి నిద్ర శరీరానికి విశ్రాంతి ఇస్తుంది. అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
శరీరం ఆరోగ్యంగా ఉండడానికి చాలా మంది వైద్య నిపుణులు ప్రతి రోజూ 7 నుంచి 8 గంటల పాటు నిద్ర పోవాలని సూచిస్తారు.
తక్కువ నిద్ర పోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే అతిగా నిద్రపోవడం వల్ల కూడా చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.
అవును అతిగా నిద్ర పోవడం వల్ల కూడా గుండె పోటు వంటి సమస్యలు వస్తాయి. దీంతో పాటు చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. అతిగా నిద్ర పోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఎక్కువ నిద్రపోవడం వల్ల కలిగే నష్టాలు:
1. గుండె జబ్బులు:
ప్రతి రోజూ 8 గంటల కంటే ఎక్కువ నిద్ర పోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొందరిలోనైతే ఏకాంగా గుండె సంబంధింత సమస్యలు కూడా వస్తాయి. ఎక్కువగా నిద్ర పోవడం వల్ల కరోనరీ ఆర్టరీ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది.
2. తలనొప్పి:
రోజూ తగినంత నిద్ర పోవడం వల్ల అలసట, తలనొప్పిని దూరమవుతాయి. అయితే అతిగా నిద్ర పోవడం వల్ల తల నొప్పులు కూడా వస్తున్నాయని ఇటీవలే ఓ అధ్యయనంలో తెలింది.
కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా వైద్యులను సంప్రదించడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
3. డిప్రెషన్:
తక్కువ నిద్రపోవడం వల్ల ఒత్తిడికి లోనవుతారని అందరికీ తెలిసిందే. అయితే అతిగా నిద్రపోవడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
కాబట్టి అతిగా నిద్ర పోయే వారు నిద్రను అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది.
4. స్థూలకాయం:
పరిమితికి మించి నిద్రపోవడం వల్ల చాలా మందిలో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఇటీవలే నిపుణులు తేల్చి చెప్పారు.
ఎక్కువగా నిద్ర పోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ విచ్చలవిడిగా పెరిగిపోయి. బరువు కూడా పెరుగుతున్నారు. కాబట్టి అతిగా నిద్ర పోవడం వల్ల శరీర బరువు కూడా పెరుగుతారు.
0 Comments:
Post a Comment