🔊ఓటీపీ చెప్పిన ఉపాధ్యాయురాలు రూ.లక్ష మాయం
🍥పాలకోడేరు, ఫిబ్రవరి 24 (ప్రభ న్యూస్): సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. మీ యోనో యాప్ వెంటనే అప్డేట్ చేసుకో చేసుకోండి అంటూ అపరిచిత వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్ కాల్ కి స్పందించడంతో విన్నాకోడేరు ఉన్నత పాఠశాలలో సోషల్ టీచర్ గా పని చేస్తున్న యాకమూరు రాజ్యలక్ష్మి బ్యాంకు ఖాతా ఖాళీ అయింది. శుక్రవారం ఉదయం పాఠశాలలో ఉండగా అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆ వ్యక్తి మాట్లాడుతూ మీ యోనో యాప్ ను వెంటనే అప్డేట్ చేసుకోవాలని, ఓటీపీ నెంబర్ తెలియజేయాలని కోరడంతో రాజ్యలక్ష్మి స్పందించారు.
🌀రెండు సార్లు తన నెంబర్ కి వచ్చిన ఓటిపి నెంబర్లు చెప్పడంతో ఒకసారి రూ.74,990 నగదు, మరో మారు రూ.24,987 నగదు తన ఖాతా నుంచి విత్ డ్రా జరిగిపోయింది. దీంతో జరిగిన నష్టం తెలుసుకున్న ఆమె పాలకోడేరు పోలీసులను ఆశ్రయించడంతో ఎస్సై శ్రీనివాసరావు శుక్రవారం రాత్రి కేసు నమోదు చేశారు.
0 Comments:
Post a Comment