💥OPS పునరుద్ధరించే రాష్ట్రాలకు షాక్!*
కార్పొరేట్ల పక్షపాతి బిజెపి
ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ (OPS) పునరుద్ధరించే రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం షాక్ ఇచ్చింది. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) పక్కనబెట్టి OPS తెచ్చారని, వీటికి 2023-24లో అదనపు రుణాలు ఇచ్చేది లేదని తెలిపింది. NPS అమలు చేస్తే GSDPలో 3 శాతానికి మించి అదనంగా రుణాలు తీసుకునే వెసులుబాటు ఉంటుందని పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ నిర్ణయం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం.. NPS లో చేరిక ఐచ్చికం అని, తీరా చేరాక మరల ఉద్యోగుల కోరిక మేరకు వెనక్కి మళ్ళిన వారికి ఈ విధంగా ఆంక్షలు విధించడం కేంద్ర కుటిల నీతి కి తార్కాణం....
కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ నిర్ణయం పూర్తిగా న్యాయ విరుద్ధం. CPS రద్దు చేయాలనుకునే రాష్ట్రాలకు ఇది ముందు కాళ్ళకు బంధనాలు వేయడం వంటిదే... ఇంక ఆంధ్ర ప్రదేశ్ సంగతి చెప్పనక్కరలేదు..ప్రతి నెలా అప్పుల వేటలో తిరుగుతున్న ఏపీ దీనిని సాకుగా వాడుకుంటుంది...దీనిని వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేయాలి.
0 Comments:
Post a Comment