Old Diary ఇంట్లో దొరికిన పాత డైరీ.. 1965 లోనే డైరీలో తాత రాసుకున్న విషయాలను చదివి అవాక్కైన మనవడు..!
ఇప్పటి జనాలకు డైరీ రాయడం ఓ వింత కావచ్చు కానీ కొన్ని దశాబ్దాల క్రితం డైరీ రాయడం ఓ కళ. ఎంతో మంది తమ మనసులోని భావాలకు అక్షర రూపం ఇచ్చి మురిసిపోయేవారు.
మదిలోని బావాలకు అక్షరాల్లో శాశ్వతంగా పదిలపరుచుకునేవారు. మరికొందరు డైరీ రాస్తూ స్వాంతన పొందేవారు. ఇక డైరీలో ఏం రాయాలనేది ఆయా వ్యక్తులను అభిరుచిని బట్టి ఉండేది. ఇప్పుడిదంతా ఎందుకంటే.. 1960ల్లో రాసిన ఓ డైరీలోని కొన్ని పేజీల చిత్రాలు నెట్టింట(Viral) పెద్ద హాట్‌టాపిక్‌గా మారాయి. తన తాత రాసి డైరీలోని కొన్ని పేజీలను ఓ వ్యక్తి ట్విటర్‌లో షేర్ చేశారు.
అక్షయ్ అనే యూజర్(Grandson) తన తాత 1965లో రాసుకున్న డైరీలోని(Grand fathers dairy) కొన్ని పేజీలను షేర్ చేశాడు. మొదట డైరీలోని వివరాలను చూసి తానే అవాక్కయ్యానని చెప్పుకొచ్చాడు. తాను ఏయే సినిమాలు చూసిందీ తారీఖులతో సహా ఆ పెద్దాయన అప్పట్లో డైరీలో రాసుకున్నారు(List of movies watched). సినిమా ఏ భాషలో తీశారో, తాను ఏ థియేటర్‌లో చూశానో కూడా ఆయన రాసుకొచ్చారు. ఇటీవలే ఆ డైరీ మనవడి కంట పడింది. దీంతో.. అతడు నోరెళ్లబెట్టాడు.
తన తాత మొత్తం 470 సినిమాలు చేశాడని అక్షయ్ చెప్పుకొచ్చాడు. అప్పట్లోనే తన తాత హిచ్‌కాక్, జేమ్స్‌బాండ్ సినిమాలు చూసేవారని మురిసిపోతూ చెప్పాడు.
ఇక ఈ ట్వీట్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంది. యూజర్లు లైక్స్, కామెంట్లతో ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అసలైన సినీ అభిమాని ఇలా ఉంటారంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి హాబీలు తమకు లేనందుకు కొంత మంది నిట్టూర్చారు. మరి నెటిజన్లను ఇంతలా ఆకట్టుకుంటున్న ఆ డైరీపై మీరూ ఓ లుక్కేయండి!
0 Comments:
Post a Comment