తేలికైన, పోషకాలున్న బ్రేక్ ఫాస్ట్(Breakfast) అనేది తప్పకుండా చేయాలి. మీ జీర్ణవ్యవస్థ మీద ఉదయం తిన్న దాని ఆధారంగానే ప్రభావం ఉంటుంది. ఆరోగ్యకరమైన అల్పాహారం రోజుకు గొప్ప ప్రారంభాన్ని అందిస్తుంది.
ఇది మీ శరీరానికి రోజంతా శక్తిని ఉండేలా చేస్తుంది. రుచికరమైన ప్రాంతీయ వంటకాలు మాత్రమే కాకుండా.. పోషకాలు ఉన్నవి తీసుకోవడం మంచిది.
దక్షిణ భారతదేశంలోని ఉప్మా, ఇడ్లీ నుండి ఉత్తర భారతదేశంలోని పోహాలాంటివి మీ ఉదయాన్ని హెల్తీగా మార్చేస్తాయి. మీకు సమయం తక్కువగా ఉన్నప్పటికీ, రుచికరమైన అల్పహారం సిద్ధం చేసుకోవచ్చు.
ఉప్మా.. ఇది ప్రసిద్ధ దక్షిణ భారత అల్పాహారం..! వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. పెరుగుతో పాటు ప్రోటీన్-రిచ్ పప్పు లాంటివి ఉపయోగిస్తారు.
ఈ రెసిపీ ఉదయం అల్పాహారానికి సరైనది. పైన కొబ్బరి తురుము చల్లి సర్వ్ చేస్తే టెస్ట్ అదిరిపోతుంది.
ఇక ఇడ్లీ తింటే అన్నింటికీ బెటర్. తేలికైనది, పోషకమైనది. కాబట్టి ఇది రోజును మెుదలుపెట్టేందుకు ముఖ్యమైన అల్పాహారం. కొబ్బరి చట్నీ, సాంబార్‌తో ఇడ్లీలను కలిపి తింటే ఆహా.. ఆ రుచే వేరు.
వెజిటబుల్ పరాటా రెసిపీ ఖచ్చితంగా మీకు పోషకాహారం. రుచిని కూడా అందిస్తుంది. దీన్ని పెరుగు, చట్నీ లేదా ఊరగాయతో కలిపి తినండి. పోషకమైన అల్పాహారాన్ని ఆస్వాదించండి.
పోహా తినేందుకు తేలికగా ఉంటుంది. తయారు చేయడం సులభం. పోహా అనేది దేశంలో దాదాపు ప్రతిచోటా తినే ప్రసిద్ధ అల్పాహారంగా మారిపోయింది.
దీనిని అనేక విధాలుగా తయారు చేయవచ్చు. కంద పోహా, సోయా పోహా, ఇండోరి పోహా, నాగ్‌పూర్ టెహ్రీ పోహా లాంటివి చేస్తుంటారు.
పెసరుపప్పు చాలా ఇళ్లలోని వంటకాలలో విస్తృతంగా ఉపయోగిస్తారు. దానితో తయారుచేసేదే మూంగ్ దాల్ చీలా.
పోషకాలను పెంచడానికి, మరింత ప్రోటీన్ అందించేందుకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లాగా చేయోచ్చు.
0 Comments:
Post a Comment