New Rules in Tirumala: శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. తిరుమలలో ఇక నుంచి కొత్త రూల్.
Face Recognition Technology In Tirumala: తిరుమలలో ఇక నుంచి కొత్త రూల్ అమలు కానుంది. భక్తుల కోసం ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీని అమలు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది.
శ్రీవారి సర్వదర్శనం, లడ్డూప్రసాదం, గదుల కేటాయింపు, రీఫండ్ చెల్లింపులు తదితర అంశాల్లో మరింత పాదర్శకతం కోసం చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఒక వ్యక్తి అధిక లడ్డూ టోకెన్లు తీసుకోకుండా నివారించేందుకు.. వసతి గదుల కేటాయింపు కేంద్రాల వద్ద.. కాషన్ డిపాజిట్ కౌంటర్ల దగ్గర ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజనీ ఉపయోగిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. మార్చి 1 నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని.. ఆ తరువాత పూర్తిస్థాయిలో ఉపయోగిస్తామన్నారు. దళారీ వ్యవస్థకు కూడా చెక్ పెట్టొచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఇక తిరుమలలో భక్తుల రద్దీ ప్రస్తుతం సాధారణంగా ఉంది. ఒక కంపార్టుమెంట్‌లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 61,374 మంది భక్తులు దర్శించుకున్నారు. 19,691 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు . సోమవారం స్వామి వారి హుండీకి రూ.4.2 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
జ్ఞాన ప్రసూనాంబ, శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. టీటీడీ తరపున ఈవో ఏవీ ధర్మారెడ్డి దంపతులు స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ ధర్మకర్తల మండలి ఏవీ ధర్మారెడ్డి దంపతులకు స్వాగతం పలికారు. ధర్మారెడ్డికి ఆలయ అర్చకులు తలపాగా చుట్టి.. తల మీద పట్టు వస్త్రాలు ఉంచారు. పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం.. అర్చకులు వేద ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం చివరి రోజు కాగా.. ఉదయం త్రిశూలస్నానం అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ నటరాజ స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఊరేగింపుగా రాగా.. భక్తులు కర్పూర హారతులు సమర్పించి పూజలు నిర్వహించారు. సోమవారం సాయంత్రం నుంచి రాత్రి 7 గంటల వరకు ధ్వజావరోహణం నిర్వహించారు. ఈ కార్యక్రమాలను వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
0 Comments:
Post a Comment