చాలా మంది పొద్దు పొద్దున్నే అన్నం తింటారు. కానీ కొంతమంది ఉదయం అన్నం తినడం మంచిది కాదని భావిస్తుంటారు. ఇంతకీ పొద్దున్న అన్నం తినడంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే..
ఉదయం తినే ఆహారమే మన శరీరానికి శక్తినిస్తుందని... దీనితోనే మనం రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటామని చాలా మంది పెద్దలు నమ్ముతారు. అయితే చాలా మంది ఉదయం పూట అన్నాన్నే తింటారు.
అన్నమే శక్తివంతమైనది నమ్ముతారు. ఇంకొంతమంది దోషలు, పూరీలు, ఇడ్లీ , వడ అంటూ రకరకాల టిఫిన్లను తినడానికి ఇష్టపడతారు. ఈశాన్య భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల ప్రజలు ఉదయం పక్కాగా అన్నాన్నే తింటారు.
జపాన్ వంటి కొన్ని దేశాలలో కూడా బియ్యాన్నే ఉదయం భోజనంగా తీసుకుంటారు. అన్నం మన కడుపుని ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది.
అలాగే శక్తివంతంగా ఉంచుతుంది. ఏదేమైనా.. చాలా మంది ఉదయం అన్నాన్ని తినడం మంచిది కాదని భావిస్తుంటారు. దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
వరి శక్తి కేంద్రం
అన్నాన్ని తినకపోతే పొట్టలో వెల్తీ ఉందని భావించే వారు చాలా మందే ఉన్నారు. కానీ బరువు పెరుగుతామనో.. మరే కారణం చేతనో కానీ చాలా మంది ఉదయం అన్నాన్ని అసలే తినరు. కానీ ఉదయం అన్నాన్ని బేషుగ్గా తినొచ్చంటున్నారు నిపుణులు.
ఎందుకంటే అన్నంలో కార్బోహైడ్రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది ఎనర్జీ పవర్ హౌట్ అంటారు నిపుణులు. బఠానీలు, బీన్స్, క్యారెట్లు, బచ్చలికూర, గుమ్మడికాయ వంటి కూరగాయలతో బియ్యాన్ని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. దీనిలో ఎన్నో పోషకాలు ఉంటాయి.
ఏదైనా రంగు బియ్యంలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఫోలేట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. మొత్తంలో బియ్యం ఆరోగ్యకరమైన, పోషక-దట్టమైన ఆహారమని నిపుణులు చెబుతున్నారు.
రోజులో ఏ సమయంలో అన్నం తినడం మంచిది?
రోజుకు మన శరీరానికి అవసరమయ్యే కార్భోహైడ్రేట్లలో ఎక్కువ భాగం ఉదయం పూటే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీనివల్లే మీ శరీరం మరింత చురుకుగా, ఎనర్జిటిగ్ గా ఉంటుంది.
బరువును తగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్న వారికి లేదా డయాబెటిస్ ఉన్నవారికి ఉదయం అన్నాన్ని తినడం మంచి ప్రయోజకరంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిల పెరుగుదలను నివారించడానికి సహాయపడుతుంది.
అయితే అన్నాన్ని మితంగా, సమతుల్య ఆహారంలో భాగంగా తినాలని నిపుణులు చెబుతున్నారు. అప్పుడే అన్నం పౌష్టికాహారంలో భాగం అవుతుంది. ఇకపోతే రాత్రి విషయానికొస్తే రాత్రి భోజనంలో అన్నం తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది మీ బరువును పెంచుతుంది.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో అన్నాన్ని ఇలా వండుకుని తినండి
వెల్లుల్లి, గుడ్డు ఫ్రైడ్ రైస్
ఇది ఆకలిని నివారించడానికి బాగా సహాయపడుతుంది. నిజానికి ఇది టేస్టీగా కూడా ఉంటుంది. అంతేకాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ముఖ్యంగా వెల్లుల్లి నుంచి పొందిన అల్లిసిన్ అనే పదార్ధం కారణంగా ఈ మొత్తంలో వంటకంలో కేలరీలు తక్కువగా ఉంటాయి.
పోషకాలు మాత్రం ఎక్కువగా ఉంటాయి. యాంటీబయాటిక్ లక్షణాలను కలిగి ఉన్న వెల్లుల్లి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అధిక రక్తపోటును తగ్గిస్తుంది. ఇకపోతే గుడ్డు ప్రోటీన్ కు మంచి మూలం. గుండెకు మేలు చేసే ఆరోగ్యకరమైన అసంతృప్త కొవ్వులు గుడ్లలో పుష్కలంగా ఉంటాయి.
జఫ్రానీ పులావ్
బాస్మతి బియ్యం, గింజలు, కుంకుమపువ్వు, పాలు, క్రీమ్ ఉపయోగించి ఈ వంటకాన్ని తయారు చేస్తారు. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచడానికి సహాయపడుతుంది.
బసంతి పులావ్
మిష్టి పులావ్ అని కూడా పిలువబడే బసంతి పులావ్ ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. ఇందులో జీడిపప్పు, ఎండుద్రాక్షలు కూడా ఉంటాయి. జీడిపప్పులో చక్కెర తక్కువగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉంటుంది.
దీనిలో రాగి, మెగ్నీషియం కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి శక్తి, మెదడు ఆరోగ్యం, రోగనిరోధక శక్తిని ఉత్పత్తి చేయడానికి అవసరం.
చావల్ కీ ఖీర్
బియ్యంతో తయారైన ఖీర్ లో మంచి మొత్తంలో పిండి పదార్ధం ఉంటుంది. ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మంటను తగ్గిస్తుంది. అలాగే ఇది మన మొత్తం శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ముఖ్యంగా ఎండాకాలంలో..
0 Comments:
Post a Comment