Millets: ఆహారాలకే అమ్మలాంటివి చిరుధాన్యాలు - వీటిని మెనూలో చేర్చుకుంటే ఎంత ఆరోగ్యమో
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ఆరంభంలోనే ఆరోగ్య అంశాల గురించి మాట్లాడారు. ప్రజలు ఆరోగ్యం కోసం చిరుధాన్యాలను తినడం ప్రారంభించాలని చెప్పారు.
భారతదేశాన్ని చిరుధాన్యాలకు గ్లోబల్ హబ్గా మార్చాలనుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం, భారతదేశం అతిపెద్ద చిరుధాన్యాల ఉత్పత్తిదారుగా, రెండవ అతిపెద్ద ఎగుమతిదారుగా ఉంది. చిరుధాన్యాలను ‘శ్రీ అన్న’ అని పిలుస్తారని, అంటే అన్ని ఆహారాలకు తల్లిలాంటివి చిరుధాన్యాలు అని ఆమె వివరించారు. 2023ని ‘ఇంటర్నేషనల్ మిల్లెట్స్ ఇయర్’గా ప్రకటించారు. జొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగులు, అరికెలు, సామలు, ఊదలు... వంటివి చిరుధాన్యాలుగా పిలుస్తారు. వీటిని తినేవారి సంఖ్య తక్కువైపోయింది. పూర్వం వీటిని మాత్రమే తినేవారు. ఎప్పుడైతే బియ్యం వాడకం పెరిగిందో... అప్పట్నించి చిరుధాన్యాలు తినడం మానేశారు ప్రజలు.
పొట్ట ఆరోగ్యానికి...
చిరుధాన్యాల్లో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతాయి.వీటిలో ఉండే ఫైబర్ మిమ్మల్ని ఎక్కువసేపు పొట్ట నిండుగా ఉండేలా చేస్తాయి.జీర్ణక్రియను ఎక్కువ సేపు జరిగేలా చేస్తాయి. కాబట్టి ఆకలి త్వరగా వేయదు.
మెదడుకు...
వీటిలో ఉండే పొటాషియం మెదడులోని నరాల సిగ్నల్ ట్రాన్స్మిషన్ను బలోపేతం చేస్తుంది. కండరాల పనితీరుకు కూడా సాయపడుతుంది.
బరువు తగ్గేందుకు...
చిరుధాన్యాల్లో విటమిన్ ఎ, విటమిన్ బి, ఫాస్పరస్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు, నియాసిన్, కాల్షియం, ఐరన్, ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ మీ శరీరానికి అవసరమైన పోషకాలు. వీటిని తింటూనే బరువు తగ్గొచ్చు. ఊబకాయం బారిన పడకుండా చిరు ధాన్యాలు కాపాడతాయి.
డయాబెటిస్
డయాబెటిక్ రోగులకు ఇవి చిరుధాన్యాలు ఎంతో మేలు చేస్తాయి. ఇవి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. ప్రీ డయాబెటిక్ రోగులకు, డయాబెటిస్ బారిన పడిని వారికి ఇవి ఉత్తమ ఆహారం. రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా చూడడంలో ఇవి ముందుంటాయి.
ఇవే కాదు ఎన్నో మానసిక రోగాలు రాకుండాను ఇవి అడ్డుకుంటాయి. నరాల బలహీనత, మలబద్ధకం, క్యాన్సర్, మైగ్రేన్, రక్తహీనత వంటి సమస్యలు ఉన్న వారు చిరు ధాన్యాలతో వండిన ఆహారాన్ని రోజూ తింటే ఇవన్నీ దూరమవుతాయి.
చిరుధాన్యాలతో ఉప్మా, ఇడ్లీలు, చపాతీలు, కిచిడీ, లడ్డూలు, చిక్కీలు,సూప్, కేకులు... ఇలా రకరకాల వంటలు చేసుకోవచ్చు. గోధుమలు, బియ్యం పక్కన పెట్టి పూర్తి చిరుధాన్యాలతో నచ్చిన వంటకాలు చేసుకోవచ్చు. వీటిని తిన్నాక రెండు వారాల్లోనే మీ ఆరోగ్యంలో చాలా మార్పు కనిపిస్తుంంది. అలసట, నీరసం దూరమైపోతాయి. రోజంతా ఉత్సాహంగా, చురుగ్గా ఉంటారు.
0 Comments:
Post a Comment