శరీరంలో మాయ చేసే మెంతులు.. తేనెతో కలిపి తీసుకుంటే ఊహించని లాభాలు మీ సొంతం
మెంతులు.. వీటి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రుచికి చేదుగా ఉన్న మెంతుల్లో ఎన్నో విలువైన పోషకాలు నిండి ఉంటాయి. అవి మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి.
అయితే చాలా మంది చేదుగా ఉంటాయని చెప్పి మెంతులను ఎవైడ్ చేస్తుంటారు. కానీ మన శరీరంలో మెంతులు చేసే మాయ తెలిస్తే వాటిని డైట్ లో చేర్చుకోకుండా ఉండలేరు. ముఖ్యంగా తేనెతో కలిపి మెంతులను ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే మీరు ఊహించని ఆరోగ్య లాభాలు మీ సొంతమవుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం తేనెతో మెంతులను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు మెంతులు వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న మెంతులను మిక్సీ జార్లో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మెంతి పొడిని ఒక బాక్స్ లో నింపుకుని స్టోర్ చేసుకోవాలి. ప్రతిరోజు వన్ టేబుల్ స్పూన్ తేనెకు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతి పొడిని కలిపి తీసుకోవాలి.
ఇలా తేనె మెంతి పొడి కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ ఎంతో చురుగ్గా పని చేస్తుంది. గ్యాస్, అజీర్తి, ఎసిడిటీ, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి. అలాగే మెంతులు తేనె కలిపి ప్రతి రోజూ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారు. పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. కొద్దిరోజుల్లోనే బాన పొట్ట ఫ్లాట్ గా మారుతుంది. క్యాన్సర్, డయాబెటిస్, హార్ట్ ఎటాక్ వంటి ప్రాణాంతక జబ్బుల బారిన పడే రిస్క్ తగ్గుతుంది. అంతేకాదు మెంతుల పొడి తేనె కలిపి తీసుకోవడం వల్ల కంటి చూపు రెట్టింపు అవుతుంది. రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. నెలసరి నొప్పులు వేధించకుండా ఉంటాయి. చర్మంపై మొండి మచ్చలు ఉంటే తగ్గు ముఖం పడతాయి. మరియు హెయిర్ ఫాల్ సమస్య సైతం సహజంగానే కంట్రోల్ అవుతుంది.
0 Comments:
Post a Comment