LIC ప్లాన్.. రూ. 1280 లతో జీవితాంతం 40 వేల పెన్షన్
దేశీయ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఎప్పటికప్పుడు తన వినియోగదారుల కోసం కొత్త కొత్త ప్లాన్‌లను అందిస్తుంది.
దీర్ఘకాలిక పెట్టుబడులపై అధిక రాబడి కావాలనుకునే వారికి LIC, 'జీవన్ ఉమంగ్ ప్లాన్'ను అందిస్తుంది. దీనిలో పెట్టుబడుల ద్వారా మంచి రాబడితో పాటు, పాలసీదారుడు మరణించిన సందర్భంలో వారి కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది. పైగా దీనిలో పెట్టుబుడులకు చెల్లించే ప్రీమియం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపులను పొందవచ్చు.
8-55 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు ప్లాన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పాలసీకి కనీస హామీ మొత్తం రూ. 1,00,000, గరిష్ట పరిమితి లేదు. దీనిలో 100 ఏళ్ల వరకు పాలసీ కవరేజ్ ఉంటుంది. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి ఈ ప్లాన్‌లో రూ. 5 లక్షల బీమా మొత్తానికి నెలకు రూ. 1280 ను 30 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించాలి. 60 ఏళ్లు వచ్చిన తర్వాత ప్రతి ఏడాది రూ.40 వేలు (బీమా మొత్తంలో 8 శాతం) వస్తాయి.
పాలసీదారుడు మధ్యలో మరణిస్తే వారి కుటుంబానికి ప్రయోజనాలను అందిస్తారు. పైగా LIC ప్రకటించిన గ్యారెంటీ జోడింపులు, లాయల్టీ జోడింపులు ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో పాలసీపై లోన్ పొందే అవకాశాన్ని కూడా పాలసీదారులకు అందిస్తారు. ఇంకా ఇతర పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్, బ్రాంచ్ లేదా ఏజెంట్‌ను సంప్రదించగలరు.
0 Comments:
Post a Comment