Leave encashment news: లీవ్ ఎన్ క్యాష్ మెంట్ పై బడ్జెట్లో కీలక ప్రకటన..
Leave encashment news: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) బుధవారం బడ్జెట్ (Union Budget) ప్రసంగంలో అర్హులైన ఉద్యోగుల లీవ్ ఎన్ క్యాష్ మెంట్ (leave encashment) పై కీలక ప్రకటన చేశారు.
లీవ్ ఎన్ క్యాష్ మెంట్ పై పన్ను మినహాయింపును రూ. 3 లక్షల నుంచి రూ. 25 లక్షలకు పెంచారు.
Leave encashment news: రిటైర్డ్ ఎంప్లాయీస్
రిటైర్ అవుతున్న ప్రభుత్వేతర వేతన జీవుల (non-government salaried employees) లీవ్ ఎన్ క్యాష్ మెంట్ (leave encashment) పై పన్ను మినహాయింపును రూ. 3 లక్షల నుంచి రూ. 25 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) వెల్లడించారు. రిటైర్ అవుతున్న ప్రభుత్వేతర ఉద్యోగుల లీవ్ ఎన్ క్యాష్ మెంట్ (leave encashment) పై పన్ను మినహాయింపు ను చివరగా 2002లో సవరించారు. తన చట్టబద్ధమైన సెలవులను ఉపయోగించుకోని ఉద్యోగులు.. ఆ సెలవులకు బదులుగా ఆ మేరకు నగదును పొందడాన్నే లీవ్ ఎన్ క్యాష్ మెంట్ (leave encashment) అంటారు.
0 Comments:
Post a Comment