Knee Pain : వారం రోజుల్లో మోకాళ్ళ నొప్పులు మాయం అవ్వాలంటే ఇలా చేయండి..
మోకాళ్ళ నొప్పులు.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని వేధిస్తున్న సమస్య ఇది. ఎక్కువగా పెద్ద వయసు వారికి చాలా సాధారణంగా మోకాళ్ళ నొప్పులు వస్తాయి.
కానీ, ఇటీవల రోజుల్లో మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్న యువకుల సంఖ్య పెరుగుతోంది. ఎముకల బలహీనత మోకాళ్ళ నొప్పులకు ప్రధాన కారణం. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే మోకాళ్ళ ఆపరేషన్ వరకు వెళ్లాల్సి ఉంటుంది. అలా కాకుండా ఆదిలోనే కొన్ని కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే మోకాళ్ళ నొప్పుల నుంచి చాలా సులభంగా బయటపడొచ్చు.
ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ చిట్కాను కనుక పాటిస్తే వారం రోజుల్లో మోకాళ్ళ నొప్పులు మాయం అవుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కాను ఏంటో తెలుసుకుందాం పదండి. ముందుగా ఒక కప్పు ఫ్రెష్ పెరుగును తీసుకోవాలి. ఈ పెరుగులో రెండు టేబుల్ స్పూన్లు తాటి బెల్లం పొడిని వేసుకోవాలి. అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు, చిటికెడు మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని నేరుగా తీసుకోవాలి.
రోజుకు ఒకసారి తాటి బెల్లం పొడి, పసుపు, మిరియాల పొడి కలిపిన పెరుగును తీసుకోవడం వల్ల బలహీనమైన ఎముకలు బలంగా తయారు కావడానికి అవసరమయ్యే పోషకాలు లభిస్తాయి. ఎముకలు బలంగా మారితే క్రమంగా మోకాళ్ళ నొప్పులు మాయం అవుతాయి. కాబట్టి మోకాళ్ళ నొప్పులతో ఎవరైతే తీవ్రంగా సతమతం అవుతున్నారో తప్పకుండా వారు పైన చెప్పిన చిట్కాను పాటించేందుకు ప్రయత్నించండి. మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది. పైగా తాటి బెల్లం పొడి, పసుపు మరియు మిరియాల పొడి కలిపిన పెరుగు తీసుకోవడం వల్ల నీరసం అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి. ఒత్తిడి పరార్ అవుతుంది. మెదడు సూపర్ షార్ప్ గా పని చేస్తుంది. జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి చాలా త్వరగా బయటపడతారు. మరియు జీర్ణ వ్యవస్థ పనితీరు సైతం చురుగ్గా సాగుతుంది.
0 Comments:
Post a Comment