జీవనశైలిలో మార్పులతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. సరిగా ప్లాన్ చేసుకుంటే.. చాలా వరకు సమస్యలను తప్పించుకోవచ్చు. వాటిని రెగ్యూలర్ గా ఫాలో అవ్వాలి.
భోజనం, నిద్ర, టీవీ అన్నీ ఒక నియమం ప్రకారం చేయాలి. టైమ్ టేబుల్ (Time Table)సెట్ చేయాలి. పెద్దల బిజీ లైఫ్(Busy Life) కారణంగా పిల్లలకు కూడా సరైన టైమ్ టెబుల్ సెట్ చేయలేకపోతున్నారు. అయితే 9-5-2-1-0 సూత్రం అమలు చేస్తే చాలా లాభం ఉంటుంది. మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు.
పిల్లలు, మీరు ఆరోగ్యం ఉండాలంటే.. దినచర్య సరిగా ఉండాలి. 9-5-2-1-0 సూత్రం చాలా ప్రయోజనకరంగా ఉంది. కొంతమంది ఇప్పటికే ఈ సూత్రాన్ని పాటిస్తున్నారు.
దీని ద్వారా ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. ఈ సూత్రం పిల్లల ఆహార సమయం, ఆట (గేమ్), టీవీ, మొబైల్ చూసే సమయం, ఎలాంటి ఆహారం(Food) తీసుకోవాలో చెబుతుంది.
9 అంటే 9 గంట నిద్ర అవసరం. మంచి నిద్ర పిల్లల ఆరోగ్యాన్ని(Health) సుస్థిరం చేస్తుంది. పిల్లలు తక్కువ నిద్రపోతే.. అది వారి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. సరైన నిద్రతోనే చాలా రకాలు సమస్యలను దూరం చేయోచ్చు. మీ పిల్లల ఆరోగ్యం కోసం 9ని ఫాలో అవ్వండి.
5 అంటే రోజుకు 5 సార్లు పండ్లు లేదా కూరగాయలు తీసుకోవడం. పిల్లలు, పెద్దలు దీనిని ఫాలో అవ్వొచ్చు. రోజుకు 5 సార్లు పండ్లు లేదా ఆహారంలో కూరగాయలు తినాలి.
దీనితో పొట్టకు సంబంధించిన సమస్యలను దూరంగా ఉంచొచ్చు. డయాబిటీస్, గుండె సంబంధిత వ్యాధులను నియంత్రించవచ్చు. పండ్లలో జామ, యాపిల్, ఆరేంజ్ వంటి వాటిని మీరు తినవచ్చు. డ్రై ఫ్రూట్స్ కూడా తినాలి.
2 అంటే.. 2 గంటల కంటే ఎక్కువ కాలం స్క్రీన్(Screen) చూడకుండా ఉండాలి. పిల్లలు ఏడుస్తున్నారంటే.. ముందుగా తీసి ఫోన్ ఇస్తారు. ఫోన్ స్క్రీన్ తో అనేక సమస్యలు వస్తాయి.
పిల్లలు, పెద్దలు అందరికీ.. ఇప్పుడు ఇదో పెద్ద అలవాటు అయిపోయింది. ఇది పిల్లల కళ్ళపై చెడు ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల అలసట, నిద్ర సమస్య వంటి సమస్యలు తలెత్తుతాయి. పిల్లల స్క్రీన్ చూసే టైమింగ్ తగ్గించుకోవడం మంచిది.
1 అంటే.. ఒక గంట వ్యాయామం చేయాలి. మీరు ఎంత బిజీ అయినా.. కూడా మీ విలువైన సమయం ఒక గంట వ్యాయామం చేయడానికి ఉపయోగించండి.
ఫిజికల్ ఫిట్ నెస్ అనేది చాలా ముఖ్యం. వ్యాయామం డిప్రెషన్, ఒత్తిడి వంటి సమస్యలను దూరం చేస్తుంది. వ్యాయామంతో ఏకాగ్రతే, పాజిటివ్ థింకింగ్(Positive Thinking) కూడా పెరుగుతుంది. పిల్లలు బయట ఆడటం వల్ల కూడా వారు యాక్టివ్ గా ఉంటారు.
0 అంటే ఈ సూత్రం ప్రకారం పిల్లల ఆహారంలో జంక్ ఫుడ్, షుగర్ పానీయాలు తగ్గించాలి. ఎందుకంటే జంక్ ఫుడ్ ద్వారా పిల్లల పొట్టలో సమస్య పెరుగుతోంది.
చక్కెర పానీయాలు దంతాలలో కేవిటీస్ సమస్య వస్తుంది. ఈ ఆహార పదార్థాలకు బదులుగా మీరు ఇంట్లోనే తయారుచేసిన పానీయం లేదా తిండిని పిల్లలకు ఇస్తే వారు ఆరోగ్యవంతులవుతారు.
0 Comments:
Post a Comment