Indian Railways: రైలు టికెట్‌పై ఉండే ఈ 5 అంకెలను గమనించారా.. ఇందులో ఉండే సమాచారం ఏంటో తెలుసా!
మీరు తరచూ రైలు ప్రయాణం చేస్తుంటారా.? అయితే ఈ వార్త మీకోసమే. మీరెప్పుడైనా రైలు టిక్కెట్‌పై ఉండే 5 అంకెల సంఖ్యను గమనించారా..! హా.. అవును ట్రైన్ నెంబర్ కదా..
అని అనుకునేరు. కానీ ఆ 5 అంకెల సంఖ్య వెనుక ఇంకా చాలా సమాచారం దాగి ఉంది. ఈ నెంబరు మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు అనే విషయాలను మాత్రమే కాదు.. రైలు స్థితి, దాని గతి అన్నీ తెలుసుకోవచ్చు. కేవలం 5 అంకెల సంఖ్యలోనే ఇంత సమాచారం దాగి ఉందంటే ఆశ్చర్యం కలుగుతోంది కదూ. కానీ ఇది నిజమే. వాస్తవానికి ప్రతి రైలుకు ప్రత్యేక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ దాని గుర్తింపును తెలియజేస్తుంది. ఈ అంకెలు 0 నుంచి 9 వరకు ఉండవచ్చు. ఉదాహరణకు 0 అంటే ఈ రైలు స్పెషల్ ట్రైన్ అని అర్థం. (వేసవి స్పెషల్, హాలిడే స్పెషల్ లేదా ఇతర స్పెషల్ కేటగిరీకి చెందినది)
1 నుంచి 4 వరకు అంకెల అర్ధం ఏంటంటే.?
మొదటి అంకె 1 లేదా 2 ఉంటే రైలు చాలా దూరం వెళుతుందని అర్థం. ఈ రైలు రాజధాని, శతాబ్ది, జన్ సాధర్, సంపర్క్ క్రాంతి, గరీబ్ రథ్, దురంతో అయి ఉండొచ్చు. అలాగే మొదటి అంకె 3 అయితే ఈ రైలు కోల్‌కతా సబ్ అర్బన్ రైలు అని అర్థం. మరి మొదటి అంకె 4 అయితే అది న్యూఢిల్లీ, చెన్నై, సికింద్రాబాద్, ఇతర మెట్రో నగరాల సబ్ అర్బన్ రైలు అని అర్థం.
5 నుంచి 9 వరకు అంకెల అర్థం..
మొదటి అంకె 5 అయితే అది ప్యాసింజర్ రైలు. మొదటి అంకె 6 అయితే అది MEMU రైలు. మొదటి అంకె 7 అయితే అది DEMU రైలు. మొదటి అంకె 8 అయితే అది రిజర్వ్ రైలు. మొదటి అంకె 9 అయితే అది ముంబై సబ్ అర్బన్ రైలు. రైలు మొదటి అక్షరం 0, 1, 2తో ప్రారంభమైతే మిగిలిన నాలుగు అక్షరాలు రైల్వే జోన్, డివిజన్‌ను సూచిస్తాయి.
0- కొంకణ్ రైల్వే
1- సెంట్రల్ రైల్వే, వెస్ట్ సెంట్రల్ రైల్వే, నార్త్ సెంట్రల్ రైల్వే
2- సూపర్‌ఫాస్ట్, శతాబ్ది, జన శతాబ్ది. ఈ రైళ్ల నెక్స్ట్ డిజిట్స్ జోన్ కోడ్‌ను సూచిస్తాయి
3- ఈస్ట్ రైల్వే, ఈస్ట్ సెంట్రల్ రైల్వే
4- ఉత్తర రైల్వే, ఉత్తర మధ్య రైల్వే, నార్త్ వెస్టర్న్ రైల్వే
5- జాతీయ తూర్పు రైల్వే, ఈశాన్య సరిహద్దు రైల్వే
6- దక్షిణ రైల్వే, దక్షిణ పశ్చిమ రైల్వే
7- దక్షిణ మధ్య రైల్వే, దక్షిణ పశ్చిమ రైల్వే
8- దక్షిణ తూర్పు రైల్వే, ఈస్ట్ కోస్టల్ రైల్వే
9- పశ్చిమ రైల్వే, నార్త్ వెస్టర్న్ రైల్వే, పశ్చిమ మధ్య రైల్వే
ఇవి మాత్రమే కాదు.. రైలు టికెట్‌పై మొదటి అంకె 5,6,7లో ఏదో ఒకటైతే.. రెండవ అంకె జోన్‌ను, మిగిలిన అంకెలు డివిజన్ల కోడ్‌ను సూచిస్తాయని అర్ధం.
0 Comments:
Post a Comment