మన దైనందిన జీవితంలో ఎన్నో సార్లు కరెన్సీ నోట్లను (Currency Notes) పట్టుకుని ఉంటాం. వాటితో ఎన్నో లావాదేవీలు నిర్వహించి ఉంటాం.
కరెన్సీ నోట్లు నలిగిపోయినా, తడిచి పోయినా కూడా పాడైపోకుండా ఉంటాయి.
అసలు ఆ కరెన్సీ నోటును దేనితో తయరు చేస్తారు? కాగితంతో అనుకుంటున్నారా? అయితే మీ సమాధానం తప్పు.. ఎందుకంటే కాగితం ఎక్కువ రోజులు ఉండలేదు.. అందుకే కరెన్సీ నోట్లను పత్తితో (Cotton) తయారు చేస్తారు.
పత్తితోనే కరెన్సీ నోట్లు తయారవుతాయని రిజ్వర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) తెలిపింది.
మన దేశమే కాదు.. ప్రపంచంలో చాలా దేశాలు కూడా తమ కరెన్సీలను పత్తితో తయారు చేస్తుంటాయి.
అందుకే వాటికి మన్నిక ఎక్కువ. కాగితం కంటే పత్తి బలంగా ఉంటుంది. మన దేశంలో 75 శాతం పత్తి, 25 శాతం నార మిశ్రమాన్ని ఉపయోగించి ప్రత్యేక చర్య ద్వారా కరెన్సీ నోట్లను (Indian Currency) తయారు చేస్తారు.
ప్రింటింగ్ చేసేటపుడు ఈ పదార్థానికి జిలెటన్ అనే ద్రావణాన్ని కలుపుతారు. అందువల్ల కరెన్సీ నోటు తడిచినా చిరిగి పోవడం, రంగు కోల్పోవడం వంటిది జరగదు.
భారతీయ నోట్లు అత్యంత భద్రతా లక్షణాలను కలిగి ఉంటాయి. భారతీయ కరెన్సీ నోట్ల డిజైన్ కాలానుగుణంగా మారుతుంది. ఇక, ఐరోపాలో కరెన్సీ నోట్ల తయారీకి Comber Noil అని పదార్థాన్ని ఉపయోగిస్తారు.
ఆయా దేశాల ప్రజలు ఉపయోగించే కరెన్సీ నోట్లను తయారు చేసే హక్కు పూర్తిగా ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులకు (Central Banks) మాత్రమే ఉంటుంది.
0 Comments:
Post a Comment