India Post Recruitment: 40,889 పోస్టల్ ఉద్యోగాలు: దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ
India Post Recruitment 2023: ఉద్యోగాల భర్తీకి భారత పోస్టల్ శాఖ గతనెలలో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 40,889 గ్రామీణ డాక్ సేవక్ (Gramin Dak Sevak - GDS) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు రేపే (ఫిబ్రవరి 16, గురువారం) ఆఖరు తేదీగా ఉంది. ఈ పోస్టులపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు రేపటిలోగా ఆన్‍లైన్‍లో అప్లికేషన్ సమర్పించాలి. జనవరి 27న అప్లికేషన్లు మొదలుకాగా.. ఫిబ్రవరి 16వ తేదీ ఆఖరు తేదీగా ఉంది. ఆంధ్రప్రదేశ్ సర్కిల్‍లో 2,480, తెలంగాణ సర్కిల్‍లో 1,266 జీడీఎస్ పోస్టుల ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు విద్యార్హత పదో తరగతిగా ఉంది. పూర్తి వివరాలు ఇవే..
దరఖాస్తు ఇలా..
India Post GDS Recruitment 2023: ఇండియా పోస్ట్ అఫీషియల్ వెబ్‍సైట్ indiapostgdsonline.gov.in లో ఈ జీడీఎస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వెబ్‍సైట్‍లోకి వెళ్లాక ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆన్‍లైన్ అప్లైలోకి వెళ్లి దరఖాస్తు పూర్తి చేయాలి. అనంతరం ఫీజు చెల్లించాలి. పూర్తయ్యాక దరఖాస్తును ప్రింటవుట్ తీసుకోండి.
దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ఫీజు రూ.100గా ఉంది. ఎస్‍సీ, ఎస్‍టీ, దివ్యాంగులు, ట్రాన్స్ఉమెన్‍కు ఫీజు మినహాయింపు ఉంది.
అర్హత, ఎంపిక విధానం
India Post Recruitment 2023: పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు ఈ పోస్టల్ జీడీఎస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష సబ్జెక్టులుగా ఉండాలి. కనీస కంప్యూటర్ పరిజ్ఞానం, సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కులు/గ్రేడ్/ మార్క్స్ పాయింట్స్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. అంటే పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ వస్తుంది. ఈ పోస్టులకు రాతపరీక్ష ఉండదు. జీడీఎస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM), డాక్ సేవక్‍గా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
వయో పరిమితి: 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయసు మధ్య ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఖాళీల భర్తీకి దరఖాస్తు చేసుకునేందుకు రేపు (ఫిబ్రవరి 16) ఆఖరి గడువుకాగా, 17వ తేదీ నుంచి 19వ తేదీ మధ్య తప్పులను సవరణ చేసుకోవచ్చు.
India Post Recruitment 2023: ఆంధ్రప్రదేశ్ సర్కిల్‍లో 2,480 జీడీఎస్ ఖాళీలు ఉన్నాయి. తెలంగాణలో 1,266, తమిళనాడులో 3,167, కర్ణాటకలో 3,036 పోస్టులు ఉన్నాయి. గరిష్ఠంగా ఉత్తరప్రదేశ్‍లో 7,987 ఖాళీలు ఉన్నాయి. మొత్తంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సర్కిళ్లలో 40,899 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా తపాలా శాఖ భర్తీ చేస్తోంది.
0 Comments:
Post a Comment