ఈ బడ్జెట్‌లో పన్ను చెల్లింపుదారులకు వరాలు కురిపించారు. వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ట్యాక్స్ శ్లాబ్స్ గురించే. కొత్త పన్ను విధానం (New Tax Regime) ఎంచుకున్నవారికి పలు ప్రయోజనాలు ఉన్నాయి.
ప్రస్తుతం రూ.2,50,000 వరకు వార్షికాదాయం ఉన్నవారికి ఎలాంటి పన్నులు లేవు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో కొత్త పన్ను విధానం ఎంచుకునేవారికి ఈ లిమిట్ రూ.3,00,000 వరకు ఉంటుంది. అంటే రూ.3 లక్షల లోపు వార్షికాదాయం ఉంటే ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు.
ఇక ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో రిబేట్‌తో రూ.5 లక్షల వరకు పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఈ లిమిట్‌ను రూ.7 లక్షలకు పెంచింది కేంద్ర ప్రభుత్వం.
అంటే వార్షికాదాయం రూ.7 లక్షల లోపు ఉంటే రిబేట్ ఉంటుంది కాబట్టి పన్ను చెల్లించాల్సిన పరిస్థితి రాదు. దీంతో పాటు పాత పన్ను విధానం ఎంచుకున్నవారికి ఉండే రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్ కొత్త పన్ను విధానం ఎంచుకునేవారికి కూడా వర్తిస్తుంది.
దీని ప్రకారం రూ.10 లక్షల వరకు వార్షికాదాయం ఉన్నవారు రూ.15,000 వరకు పన్ను ఆదా చేయొచ్చు. రూ.7 లక్షల లోపు వార్షికాదాయం ఉంటే పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
ప్రస్తుతం రూ.10 లక్షల వార్షికాదాయం ఉన్నవారు కొత్త పన్ను విధానం ఎంచుకుంటే రూ.75,000 వరకు పన్ను చెల్లించాలి. 4 శాతం ఎడ్యుకేషన్ ట్యాక్స్ ఉంటుంది కాబట్టి మొత్తం రూ.78,000 పన్ను చెల్లించాలి. తాజాగా బడ్జెట్‌లో ప్రకటించినదాని ప్రకారం రూ.10 లక్షల వార్షికాదాయం ఉన్నవారికి రూ.15,600 ఆదా అవుతోంది.
ప్రస్తుతం వారు చెల్లించాల్సిన పన్ను రూ.78,000 కాగా, వచ్చే ఏడాది చెల్లించాల్సిన పన్ను రూ.62,400 అవుతుంది. ఈ లెక్కన రూ.15,600 ఆదా చేయొచ్చు.
ఇక కొత్త పన్ను విధానం ఎంచుకున్నవారికి స్టాండర్డ్ డిడక్షన్ వర్తించదు. అయితే రూ.15,50,000 గ్రాస్ సాలరీ దాటిన వారికి 2023 ఏప్రిల్ 1 నుంచి రూ.52,500 స్టాండర్డ్ డిడక్షన్ వర్తిస్తుంది. ఈ లెక్కన రూ.15,50,000 వార్షికాదాయం దాటినవారికి ఇది కూడా లాభమే.
కేంద్ర ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయం చేస్తోందని, పాత పన్ను విధానాన్ని దశలవారీగా తొలగించడమే ఉద్దేశం కావచ్చని, రూ.7 లక్షల వరకు పన్నులు ఉండవు కాబట్టి మధ్యతరగతిపై భారం తగ్గుతుందని, ఇది వారికి పెద్ద ఉపశమనమని క్లియర్ సీఈఓ, ఫౌండర్ అర్చిత్ గుప్తా News18 తో అన్నారు.
ఇక కొత్త పన్ను విధానంలో రూ.10 లక్షల వార్షికాదాయం ఉన్నవారికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం, రాబోయే ఆర్థిక సంవత్సరంలో పన్ను ఎలా ఆదా అవుతుందో I.P. Pasricha & Co సంస్థకు చెందిన మనీత్ పాల్ సింగ్ ఈ ఉదాహరణ వివరించారు.
ఉదాహరణకు ఓ వ్యక్తి వార్షికాదాయ రూ.10 లక్షలు అనుకుందాం. కొత్త పన్ను విధానంలో ప్రస్తుతం రూ.75,000 ఆదాయపు పన్ను + రూ.3,000 ఎడ్యుకేషన్ సెస్ కలిపి మొత్తం రూ.78,000 చెల్లించాలి.
వచ్చే ఆర్థిక సంవత్సరం రూ.60,000 ఆదాయపు పన్ను + రూ.2,400 ఎడ్యుకేషన్ సెస్ కలిపి రూ.62,400 పన్ను చెల్లించాలి. రూ.15,600 పన్ను ఆదా అవుతుంది.
0 Comments:
Post a Comment