కడియపులంక కమలాచెట్టుకు రెండు వేల కాయల
మనకు కుండీలలో ఉండే కమలా మొక్కలు అరుదుగా కనపడతాయి.
అక్కడక్కడ అందం కోసం ఈ మొక్కలు పెంచుకున్నప్పటికీ పది నుంచి పాతిక కాయలు ఉండటం విశేషం.
కుండీలో ఉండే ఒకే కమాల చెట్టుకు రెండు వేల కమలాలుంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు.
తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడిపులంక శివంజనేయ నర్సరీలో ప్రస్తుతం ఆ అరుదైన కమలా చెట్లు సందడి చేస్తున్నాయి.
కుండీలో పెరిగే ఈ కమలా చెట్టుకు రెండు వేల కాయలు కాశాయా అంటే.. అనుమానం వ్యక్తం చేసే వాళ్లు వచ్చి లెక్కపెట్టుకోవచ్చు అంటున్నారు నర్సరీ నిర్వాహకులు.
కాస్త అటు ఇటుగా కచ్చితంగా 2 వేల కమలాలు కాస్తున్నాయని రైతు చెబుతున్నారు.
కార్పొరేట్ సంస్థలు, ఫంక్షన్ హల్స్ వద్ద వీటిని ప్రత్యేక ఆకర్షణగా పెట్టేందుకు కొనుగోలు చేసి తీసుకెళ్లుతున్నారు.
ఎనిమిది నుంచి పది సంవత్సరాల వయసు ఉండే ఈ చెట్టు ధర రూ. 25-35 వేల వరకు పలుకుతుంది.
అరుదైన మొక్కలను మన దేశ నర్సరీ రంగానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో వీటిని దిగుమతి చేస్తున్నట్లు నర్సరీ రైతు మల్లు పోలరాజు తెలిపారు.
0 Comments:
Post a Comment