🅰🅿️
💥గౌరవ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీ ప్రవీణ్ ప్రకాష్,IAS గారు కృష్ణాజిల్లా పర్యటన దృష్ట్యా ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు తెలుసుకోతగిన వివిధ అంశాలు
1️⃣ *బైజుస్ టాబ్స్*
బైజుస్ టాబ్స్ ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా వినియోగించాలి అనే వాటి మీద ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు పూర్తి అవగాహన ఉండాలి.
బైజుస్ టాబ్స్ ను 8వ తరగతి విద్యార్థులు ప్రతిరోజు వినియోగించేలా చూడాలి. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, హిస్టరీ, సివిక్స్, జాగ్రఫీ సబ్జెక్టులకు సంబంధించిన వీడియోస్, క్వశ్చన్స్, ప్రాక్టీస్ టెస్టులను పూర్తి చేయాలి.
2️⃣ *సిలబస్*
SCERT,AP వారు రూపొందించిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఉపాధ్యాయుడు కచ్చితంగా సిలబస్ పూర్తి చేయాలి. పాఠశాలలోని ఉపాధ్యాయులు ఎంతవరకు సిలబస్ పూర్తి చేశారు అనే అంశం మీద ప్రధానోపాధ్యాయులకు పూర్తి అవగాహన ఉండాలి.
3️⃣ *నోట్స్ వ్రాయించుట*
విద్యార్థుల చేత నోట్స్ రాయించాలి. ప్రభుత్వం ఇస్తున్న నోట్ బుక్స్ ను పూర్తిస్థాయిలో విద్యార్థులు వినియోగించాలి.
4️⃣ *నోట్స్ చెకింగ్*
విద్యార్థుల రాసిన నోట్స్ బుక్స్ ను ఉపాధ్యాయులు ప్రతిరోజు చెక్ చేయాలి, ఏమైనా తప్పులు ఉన్నట్లయితే కరెక్షన్ చేసి, రాయించాలి.
5️⃣ *నాడు నేడు*
ప్రధానోపాధ్యాయులకు వారి వారి పాఠశాలల్లో జరుగుతున్న నాడు నేడు పనులు సకాలంలో, నాణ్యతతో పూర్తిచేయాలి. నాడు నేడు లో పనులకు ఎంతెంత ఖర్చు అవుతుందో ప్రధానోపాధ్యాయులు చెప్పే విధంగా ఉండాలి.
6️⃣ *కనిష్ట సామర్థ్యాల స్థాయి*
తరగతి వారిగా విద్యార్థులు సాధించవలసిన కనిష్ట సామర్థ్యాలు విద్యార్థికి వచ్చే విధంగా బోధన జరగాలి. చదవటం, రాయటం లాంటివి.
7️⃣ *విద్యార్థుల హాజరు*
పాఠశాలకు 100% విద్యార్థులు సకాలంలో హాజరయ్యే విధంగా పాఠశాల వ్యవస్థ పనిచేయాలి.
8️⃣ *పాఠశాల పరిశుభ్రత*
పాఠశాలలో ఉన్న టాయిలెట్స్ ను పరిశుభ్రంగా మెయింటైన్ చేయాలి. పాఠశాల ఆవరణమును పరిశుభ్రంగా ఉంచాలి.
9️⃣ *హెచ్.ఎం. పర్యవేక్షణ*
పాఠశాలలో జరుగుతున్న నాడు నేడు పనుల మీద ప్రధానోపాధ్యాయులు నిరంతర పర్యవేక్షణ చేయాలి. పాఠశాలలో జరుగుతున్న అన్ని అంశాలకు జవాబుదారితనం ప్రదర్శించాలి.
1️⃣0️⃣ *పరీక్ష పేపర్ల మూల్యాంకనం*
ఉపాధ్యాయులు సకాలంలో పరీక్ష పేపర్లను మూల్యాంకనం చేయాలి. విద్యార్థులు చేత పరీక్ష పేపర్ల జవాబులను నోట్ బుక్ లో వ్రాయాలి.
1️⃣1️⃣ *మార్కుల ఆన్లైన్ ఎంట్రీ*
గతంలో జరిగిన FA-1, FA-2, SA-1 పరీక్షల మార్కులను ఆన్లైన్ ఎంట్రీ జరిగి ఉండాలి మరియు మార్కుల రిజిస్టర్లు పొందుపరచాలి. ఇప్పుడు జరిగిన FA-3 పరీక్షల పేపర్లు వాల్యుయేషన్ పూర్తిచేసి, మార్కులు ఎంట్రీ చేయాలి.
1️⃣2️⃣ *స్కూలు రికార్డుల క్రమబద్ధీకరణ*
ఎప్పటికప్పుడు స్కూలు రికార్డులను అప్డేట్ చేయాలి.
1️⃣3️⃣ *వాటర్ సదుపాయం*
RO వాటర్ ప్లాంట్ సక్రమంగా వినియోగించాలి. ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించుకోండి.
1️⃣4️⃣ *లెసన్ ప్లాన్స్ మరియు డైరీస్*
ఉపాధ్యాయులు లెసన్ ప్లాన్స్, డైరీస్ అప్డేట్ గా ఉంచాలి. ప్రధానోపాధ్యాయులు క్రమం తప్పకుండా చెక్ చేయాలి.
1️⃣5️⃣ *జగనన్న గోరుముద్ద*
జగనన్న గోరుముద్ద లో రోజువారి ఇచ్చే మెను మీద పాఠశాలలో అందరికీ అవగాహన కలిగి ఉండాలి.
Smt Tahera Sultana
DEO, KRISHNA Dt.
0 Comments:
Post a Comment