గుడ్లను తినడం..
గుండెకు హానికరమా? అనే ప్రశ్న చాలా మంది వేస్తారు. న్యూట్రియంట్స్ జర్నల్‌లో ఇలాంటి ఓ పరిశోధనకు సంబంధించిన వివరాల్ని ఇచ్చారు. దాని ప్రకారం ఎక్కువ గుడ్లు తినడం గుండెకు మేలు చేస్తుంది.
బోస్టన్ యూనివర్శిటీ పరిశోధకులు.. 2,300 మందికి పైగా పెద్దవాళ్లపై పరిశోధనలు చేశారు. వారానికి 5 లేదా అంతకంటే ఎక్కువగా గుడ్లు తినేవారికి బీపీ (Blood Pressure) తగ్గుతోందనీ, రక్తంలో షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతున్నాయనీ, టైప్ 2 డయాబెటిస్ రిస్క్ కూడా తగ్గుతోందని తేల్చారు. అందువల్ల గుడ్లను తింటే గుండెకు మేలే.
అమెరికా హార్ట్ అసోసియేషన్ ప్రతిపాదన ప్రకారం.. రోజూ 1 లేదా 2 గుడ్లను తినవచ్చు. ఐతే.. గుడ్లలో తెల్లసొనను మాత్రమే తినాలని సూచించింది. గుడ్లలో ప్రోటీన్, ఇతర పోషకాలు ఉంటాయి.
అదే సమయంలో అవి కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని పెంచుతాయి.. కాబట్టి అవి గుండెకు మంచివి కాదని అమెరికా హార్ట్ అసోసియేషన్ అభిప్రాయపడింది.
ఒక గుడ్డు ద్వారా సుమారు 6 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. ఐతే.. సాధారణంగా ఒక వ్యక్తికి ప్రతి రోజూ తన బరువులో ప్రతి కేజీకీ దాదాపు 1 గ్రాము ప్రోటీన్ అవసరం. అంటే.. 60 కేజీల బరువు ఉండే వ్యక్తికి రోజూ 40 నుంచి 60 గ్రాముల ప్రోటీన్ అవసరం.
గుడ్డులో ఇంకా చాలా ఉంటాయి. విటమిన్ A - 6 శాతం, విటమిన్, విటమిన్ B2 - 15 శాతం, B5 - 7 శాతం, విటమిన్ B12 - 9 శాతం, ఫాస్పరస్ - 9 శాతం, సెలెనియం - 22 శాతం ఉంటాయి. అందువల్ల రోజూ 1 గుడ్డుతోపాటూ.. ఒక పండు, బ్రెడ్ కలిపి బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
గుడ్లలో డైటరీ ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి.. బీపీని తగ్గిస్తాయి. ఇవి రక్త నాళాలకు విశ్రాంతి కలిగిస్తాయి. రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తాయి. ప్రోటీన్ వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. ఫలితంగా రక్తంలోకి గ్లూకోజ్ త్వరగా కలవదు.
ఫలితంగా డయాబెటిస్ ఉన్న వారికి ఇది సమస్యగా మారదు. రోజూ 1 గుడ్డు తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ కలిసే వేగం 4.4 శాతం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
మొత్తంగా గుడ్లను తినడం మంచిదేనని నిపుణులు చెబుతున్నారు. ఐతే.. రోజూ 1 గుడ్డు తినడం మేలు. రోజూ 2 తినాలి అనుకుంటే.. గుడ్డులోని తెల్లసొన మాత్రమే తినడం మేలు.
ఇది అందరికీ ఒకే రకంగా వర్తించకపోవచ్చు. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టీ ఫలితాలు ఉంటాయి. దీన్ని న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు. దీన్ని లెక్కలోకి తీసుకునే ముందు.. సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోండి.
0 Comments:
Post a Comment