Health Tips - శరీరం నీరసంగా ఉండి చేతులు కాళ్లు లాగుతున్నాయా.. అయితే వీటిని తీసుకోండి..
ప్రస్తుత కాలంలో మనలో చాలామందికి పనిచేయడానికి శక్తి సరిపోవటం లేదు. నీరసం,నిస్సత్తువ, బలహీనత వంటి సమస్యలతో చాలామంది ప్రజలు బాధపడుతున్నారు. అలాగే డబ్బులు లేక అందరి వల్లే అన్ని రకాల బలమైన పౌష్టికి ఆహారాలను కొనుగోలు చేసి తినలేక ఇబ్బంది పడుతున్నారు.
ఇలా బలహీనత సమస్యతో బాధపడేవారు కొన్ని పౌష్టిక ఆహారాలు కొనుగోలు చేసి తీసుకోగలిగే పంచరత్నాలు వంటి విత్తనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ విత్తనాలు తీసుకోవడం వల్ల మాంసం కంటే ఎక్కువ బలం చేకూరుతుందని వారు చెబుతున్నారు. ప్రకృతి ప్రసాదించిన అతి బలమైన విత్తనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందరికీ అందుబాటులో ఉండడంతో పాటు మిక్కిలి బలాన్ని చేకూర్చే ఆహారాల్లో పల్లీలు మొదటి స్థానంలో ఉంటాయి.
అంతేకాకుండా పచ్చి కొబ్బెర, పుచ్చ గింజల పప్పు, గుమ్మడి గింజల పప్పు, పొద్దు తిరుగుడు పప్పు ఇలాంటివి శరీరానికి తగినంత బలాన్ని చేకూర్చడం కోసం ఉపయోగించవచ్చు. అలాగే ఈ విత్తనాలు మనకు తక్కువ ధరలోనే మార్కెట్లో లభిస్తాయి. ఈ పచ్చి కొబ్బరిని ముక్కలుగా చేసి బెల్లంతో కలిపి తీసుకోవాలి. అలాగే పల్లిలను ఇతర విత్తనాలను విడివిడిగా నానబెట్టి తీసుకోవాలి. వీటిని సుమారు 8 గంటల పాటు నానబెట్టి తినడం ఎంతో మంచిది. ఇలా నానబెట్టిన పప్పును శుభ్రంగా కడిగి అలాగే విడివిడిగా ప్లేట్లో తీసుకొని తినడం ఎంతో మంచిది. ఈ విత్తనాలను ఖర్జూర పండ్లతో కలిపి తింటే తినడానికి చక్కగా రుచిగా కుడా ఉంటాయి. ఇలా రోజులో ఎప్పుడైనా ఒక పూట కొబ్బరి ముక్కలను నానబెట్టిన విత్తనాలను, పండ్లను తినడం వల్ల శరీరానికి ఎక్కువ బలం అందుతుంది. ఇలాంటి ఆహారాన్ని చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరికైనా తినిపించవచ్చు. ఇలా తీసుకున్న రెండు రోజుల్లోనే మన శరీరంలో వచ్చిన మార్పులను గమనించవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల శరీర నీరసం, బలహీనత వంటి సమస్యలతో బాధపడేవారు ఈ పంచరత్నాల వంటి ఆహారాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు వెల్లడించారు.
0 Comments:
Post a Comment