చాలామంది కూల్ వాటర్ తాగడాన్ని ఇష్టపడుతూ ఉంటారు. కూల్ వాటర్ తాగకపోతే అసలు తాగినట్టే అనిపించదు అని ఫీల్ అవుతూ ఉంటారు. కూల్ వాటర్ తాగితేనే నీళ్ళు తాగినట్టు ఉంటుందని భావించే వారు కూడా లేకపోలేదు.
అయితే కూల్ వాటర్ ఏ మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదని, అనేక అనారోగ్య సమస్యలకు కూల్ వాటర్ కారణమవుతుందని వైద్యులు చెబుతున్నారు.
వేడి నీటిని తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అని, ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండవచ్చని సూచిస్తున్నారు.
వేడినీటితో మధుమేహానికి చెక్.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
వేడి నీళ్లు తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్న వైద్యులు నిత్యం వేడి నీటిని తాగటం అలవాటు చేసుకుంటే మధుమేహం రాదని చెబుతున్నారు.
ఆర్థరైటిస్ సమస్య ఉత్పన్నం కాదని, కీళ్ల నొప్పులు బాగా బాధించే వారికి, ఆ బాధలు కొంత మేర తగ్గుతాయని చెబుతున్నారు. వేడి నీళ్లు తాగడం వల్ల కడుపు ఆరోగ్యంగా ఉంటుందని, ఎప్పటికీ కడుపు చెడిపోదని సూచిస్తున్నారు.
వేడి నీళ్లు తాగడం వల్ల ఉదర సమస్యల పరిష్కారం మాత్రమే కాకుండా, గొంతు సమస్యలు రావని, దగ్గు వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. అనేక రకాల చర్మ సమస్యల నుండి కూడా ఉపశమనం దొరుకుతుందని అంటున్నారు.
వేడి నీళ్ళతో ఒబేసిటీ నుండి ఉపశమనం
నిత్యం వేడి నీళ్లు తాగే వారికి జలుబు కూడా త్వరగా రాదని చెబుతున్నారు. ఇక నిమోనియా వచ్చే అవకాశం లేదని అంటున్నారు.
స్థూలకాయంతో బాధపడేవారు వేడి నీళ్లు తాగితే ఆ సమస్య నుంచి కొంతమేర ఉపశమనం దొరుకుతుందని, అధిక బరువును తగ్గించడంలో వేడి నీళ్లు గణనీయమైన పాత్రను పోషిస్తాయని చెబుతున్నారు.
శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించటంలో, మన శరీర మెటబాలిజం ను పెంచటంలో వేడి నీళ్ళు గణనీయమైన పాత్ర పోషిస్తాయని అంటున్నారు. వేడి నీళ్లను త్రాగడం వల్ల వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం తగ్గుతుందని, అనేక రోగాల నుంచి బయటపడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
వేడినీళ్ళు తాగటానికి ఒక పద్ధతి
అయితే వేడి నీళ్లు తాగడానికి కూడా ఒక పద్ధతి ఉంటుందని, ఆ పద్ధతి ప్రకారం వేడి నీళ్లను తాగినప్పుడు మంచి ఫలితం ఉంటుందని సూచిస్తున్నారు. వేడి నీళ్లు తాగమన్నారని, విపరీతంగా వేడిగా ఉన్న నీటిని తాగకూడదని దానివల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
గోరువెచ్చగా ఉన్న నీటిని తాగితే మంచిదని సూచిస్తున్నారు. ఇక నీళ్ళను తాగేటప్పుడు గుటక గుటకగా నీటిని చప్పరిస్తూ తాగాలని సూచిస్తున్నారు.
నిద్ర లేచిన వెంటనే వేడినీళ్ళు ఇలా తాగండి.. అద్భుతమైన ఫలితం మీరే చూడండి
ఉదయమే నిద్ర లేచిన వెంటనే చాలా మంది నిమ్మరసం తేనె వేడినీటిలో కలుపుకుని తాగుతారు. అయితే దానికంటే ముందే రెండు మూడు గ్లాసులు గోరువెచ్చని నీటిని తాగితే మంచిదని సలహా ఇస్తున్నారు.
ఉదయం నిద్ర లేచిన వెంటనే పరగడుపున మూడు గ్లాసులు వేడి నీటిని తాగడం మన శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపించడానికి ఉపయోగపడుతుందని సూచిస్తున్నారు.
ఎప్పుడు రోగగ్రస్తులం కాకుండా ఆరోగ్యంగా ఉండడం కోసం కూల్ వాటర్ కు గుడ్ బై చెప్పి వేడి నీళ్లు తాగడం మంచిదని సలహా ఇస్తున్నారు.
మనం నీళ్ళు తాగే ప్రతీసారి గోరు వెచ్చని నీళ్ళనే తాగటం వలన మనం ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పొరబాటున కూడా మితిమీరిన వేడి నీటిని తాగకూడదని హెచ్చరిస్తున్నారు.
0 Comments:
Post a Comment