నోటి పూత.. చాలామంది సీజన్ తో సంబంధం లేకుండా ఈ నోటిపూత సమస్యతో బాధపడుతూ ఉంటారు. నోటి పూత నాలుకతో పాటు పెదవులకు చిన్నచిన్న పుండ్లుగా ఏర్పడుతూ ఉంటుంది.
ఈ నోటి పూత సమస్య వచ్చినప్పుడు ఏది తిన్నా కూడా కారంగా మంటగా అనిపిస్తూ ఉంటుంది. అయితే చాలా మందికి నోటి పూత ఎందుకు వస్తుంది అంటే లో జ్వరం అని చెబుతూ ఉంటారు.
మరి అది ఎంతవరకు నిజం అసలు నోటి పూత సమస్య ఎందుకు వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నోటి పూత రావడానికి అధిక ఒత్తిడి, మనం తీసుకునే ఆహారం మన శరీరానికి పడకపోవడం, ఎక్కువగా ఆమ్ల గుణాలు ఉన్న పండ్లు, కూరగాయలను అధికంగా తీసుకోవడం, హార్మోన్ల అసమతుల్యత, విటమిన్, ఐరన్ లోపాలు, ఎక్కువగా పెయిన్ రిలీఫ్ టాబ్లెట్లు వాడటం, నోరు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల నోటిపూత వస్తుంది.
నోటి పూత వచ్చిన వారు ఎక్కువగా మంచినీరు తాగాలి.అదే విధంగా శరీర ఉష్ణోగ్రతలను కూడా అదుపులో ఉంచుకోవాలి. చాలామందికి ఒత్తిడి వల్ల కూడా ఈ నోటి పూత వస్తు.
నోటి పూత త్వరగా తగ్గాలని చాలామంది ఎన్నో రకాల చిట్కాలను పాటిస్తూ ఉంటారు. మరి నోటి పూత వచ్చిన వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నోటి పూత సమస్య ఉన్నవారు తేనెను ఉపయోగించడం వల్ల త్వరగా నోటి పూత సమస్యను నుండచి ఉపశమనం లభిస్తుంది.
తేనే, పసుపు కలిపి నోటి పూత వచ్చిన ప్లేస్ లో అప్లై చేయడం వల్ల మంట నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. కొబ్బరి నీళ్ళతో కూడా నోటిపూత సమస్య తగ్గుతుంది. నోటిపూత వచ్చినవారు నెయ్యి, ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.
అలాగే మసాలా ఉన్న ఆహారాన్ని తినకూడదు. సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. మాంసాహారం తినడాన్ని తగ్గించాలి. కారం, పులుపు, ఉప్పు ఎక్కువగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. భోజనం చేసిన ప్రతిసారీ నోటిని కడుక్కోవాలి.
నోటి పూతతో బాధపడేవారు నోట్లో పుండ్లు వచ్చిన చోట నెయ్యి రాస్తే సమస్య తగ్గుతుంది. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఇక కొత్తిమీర కషాయాన్ని తయారుచేసుకుని, నోట్లో పోసుకుని కాసేపు పుక్కిలిస్తే నోటి పూత తగ్గుతుంది.
తులసి ఆకులను తినడం వల్ల కూడా నోటి పూత సమస్యలను తగ్గించుకోవచ్చు.
నోటి పూత సమస్యతో ఇబ్బంది పడేవారు తమలపాకులను నమిలి తినడం వల్ల కూడా నోటి పూత సమస్యను నుంచి ఉపశమనం పొందొచ్చు. ఇక గ్లిజరిన్ వల్ల కూడా నోటి పూత త్వరగా తగ్గుతుంది.
0 Comments:
Post a Comment