Headaches: తలనొప్పి సమస్య చిన్నదే అయినా ప్రశాంతంగా ఉండనీయదు. తల పట్టేసినట్లు అనిపిస్తుంది. దీంతో ఏ పని చేయడానికి వీలు కాదు. తల పట్టుకుని ఉండాల్సిందే.
ఇంకా ఎక్కువైతే తల దిమ్మ దిమ్మ అని కొట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో ఏదైనా పని చేయాలన్నా చేయబుద్ధి కాదు. తల సమ్మెట పట్టి కొట్టినట్లుగా ఫీలింగ్ కలుగుతుంది. తలనొప్పి రావడానికి పలు కారణాలున్నాయి.
తలనొప్పిని తేలిగ్గా తీసుకోవటానికి లేదు. కొందరైతే తలనొప్పిని ఏదో సైడ్ ఎఫెక్ట్ గా చూస్తారు.
Headaches
మనం చేసే పనుల కారణంగానే..
ఇటీవల కాలంలో మనం చేసే పనులే మనకు ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. ప్రస్తుతం అందరు కూర్చుని చేసే పనులే చేస్తున్నారు. పొద్దంతా కూర్చుని కంప్యూటర్ తో చేసే పనులు చేయడానికే అధిక శాతం మంది మొగ్గు చూపుతున్నారు.
ఈ నేపథ్యంలో తలనొప్పి సమస్య వేధిస్తోంది. తలలో తలెత్తే నొప్పి క్రమంగా శరీరం అంతటా వ్యాపించి ప్రాణాంతక వ్యాధిగా రూపాంతరం చెందుతుంది. తలనొప్పి ఎందుకు వస్తుంది? తలనొప్పి వస్తే తల తిరిగినట్లుగా అనిపిస్తుంది. కళ్లు తిరుగుతాయి. ఇలా కొన్ని సంకేతాలు మనల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి.
అల్కహాల్ తో అధిక ముప్పు
తలనొప్పి రావడానికి ప్రధాన కారణాల్లో అల్కహాల్ ప్రధానమైనది. మద్యం తాగే వారికి తల పట్టేసినట్లు అనిపిస్తుంది. తాగింది దిగకపోతే కూడా తలనొప్పి వేధిస్తుంది. ప్రాసెస్ చేసిన ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా తలనొప్పి బాధిస్తుంది.
బేకరీ ఫుడ్స్ కు దూరంగా ఉండటమే శ్రేయస్కరం. లేకపోతే ఇబ్బందులు ఏర్పడతాయి. దీని వల్ల మరిన్ని బాధలు పడాల్సి వస్తుంది. బేకరీ పదార్థాల్లో చక్కెర, ఉప్పు, నూనె అధిక శాతంలో ఉండటంతో సరిగా జీర్ణం కాక తలనొప్పి సమస్య వస్తుంది.
సరైన నిద్ర లేకపోతే..
ప్రతి మనిషి రోజుకు 6-8 గంటలు నిద్ర పోవాల్సిందే. ఒకవేళ మనం నిద్ర పోయే సమయం తగ్గితే తలనొప్పి వస్తుంది. దీంతో ఏదీ మనసున పట్టదు. తల తిప్పినట్లు అనిపిస్తుంది. రాత్రిపూట త్వరగా డిన్నర్ పూర్తి చేస్తే నిద్ర తొందరగా పడుతుంది. దీంతో తొందరగా మేల్కొనవచ్చు.
రాత్రుళ్లు నిద్ర పట్టకపోతే తలనొప్పికి కారణమవుతుంది. అందుకే మన పూర్వీకులు తొందరగా నిద్రపోయి త్వరగా లేవడంతోనే వారు వందేళ్లు హాయిగా జీవించారు. వారిలో రోగనిరోధక శక్తి పెరగడానికి దోహదపడింది.
Headaches
ఒత్తిడి మూలంగా..
కొందరు అన్ని విషయాలను భూతద్దంలో పెట్టి చూస్తారు. చిన్న సమస్య అయినా దాన్ని పెద్దగా ఆలోచిస్తారు. దీంతో ఒత్తిడికి గురవుతారు. దీని వల్ల కూడా తలనొప్పి వస్తుంది.
బరువు తగ్గాలనుకునే వారు కూడా ఎక్కువ దూరం నడుస్తుంటారు. దీంతో కూడా తలనొప్పి సమస్య వెంటాడుతుంది. ఇలా తలనొప్పి రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.
పరీక్షలు చేసుకుంటేనే దేని వల్ల తలనొప్పి వస్తుందనే విషయం తెలుస్తుంది. తలనొప్పిని తక్కువగా అంచనా వేయొద్దు. సాధ్యమైనంత వరకు తలనొప్పి వస్తే దానికి కారణాలు తెలుసుకుంటేనే సరి.
0 Comments:
Post a Comment