హిందువులు ఎక్కువగా పూజించే దేవుళ్ళలో హనుమాన్ కూడా ఒకరు. హనుమాన్ ని ఆంజనేయ స్వామి అని కూడా పిలుస్తూ ఉంటారు.
అయితే అంజనేయ స్వామిని కొందరు మంగళవారం భక్తిశ్రద్ధలతో పూజిస్తే మరికొందరు శనివారం రోజున భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు.
కానీ మంగళవారం అంటే ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైనది ప్రీతికరమైనది అని చెప్పవచ్చు. ఆంజనేయస్వామిని భక్తిశ్రద్ధలతో పూజించి హనుమాన్ చాలీసా పట్టిస్తే చాలు వెంటనే తన భక్తులను గ్రహిస్తూ ఉంటాడు.
మరి హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. హనుమాన్ చాలీసాను నిజమైన మనసుతో పఠించే వ్యక్తి, హనుమాన్ జీ తన కష్టాలన్నింటినీ నాశనం చేస్తాడు.
హనుమన్ అనుగ్రహంతో జీవితంలో ఏ సంక్షోభమూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. హనుమాన్ చాలీసాను పఠించే వారికి బలం, తెలివి, జ్ఞానాన్ని అందించడంతో పాటు వారి దుఃఖాలను, కష్టాలను కూడా దూరం చేస్తాడు.
అలాగే హనుమాన్ చాలీసా ను పాటించడం వల్ల ధైర్యం కలగడంతో పాటు దయ్యాలు భూతాలు వంటివి దరిదాపుల్లోకి కూడా రావు. హనుమాన్ చాలీసాను పటించడం వల్ల వ్యాధులను విముక్తి పొందవచ్చు.
హనుమాన్ చాలీసా ను మంచి మనసుతో భక్తిశ్రద్ధలతో పటించడం వల్ల ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది.
శారీరక బాధలు కూడా దూరం అవుతాయి. అలాగే ఆత్మవిశ్వాసం ధైర్య సాహసాలు కూడా పెరుగుతాయి.
మనిషిలో ఉండే భయం, బెదిరిపోయి కావాల్సిన అంత ధైర్యాన్ని అందించడంతోపాటు ఎదిరించే శక్తిని కూడా అందిస్తాడు.
హనుమాన్ చాలీసాను వందసార్లు పఠించే వ్యక్తి అన్ని రకాల బంధాల నుండి విముక్తి పొంది గొప్ప ఆనందాన్ని పొందుతాడు.
0 Comments:
Post a Comment