Zinc Deficiency May Leads To To Hair Fall: ప్రస్తుతం జుట్టు రాలడం అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. జుట్టు రాలడాన్ని సకాలంతో తగ్గించుకోలేకపోతే బట్ట తల సమస్యలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
అయితే ఇలాంటి సమస్యలు వృద్ధాప్య దశలో వచ్చేవి కానీ అధునిక జీవన శైలి కారణంగా 20 నుంచి 25 సంవత్సరాల వయస్సులోనే వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు పోషకాల లోపం ఉండడం వల్లేనని..కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.
జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు:
ఆధునిక జీవన శైలి కారణంగా చాలా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం లేదు. అంతేకాకుండా చాలా మంది వివిధ కారణాల వల్ల ఒత్తిడికి కూడా గురవుతున్నారు. దీని కారణంగా జుట్టు సులభంగా రాలిపోతోందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
జింక్ లోపం వల్ల కూడా జుట్టు రాలుతుంది:
జుట్టు హెల్తీగా ఉండడానికి విటమిన్ డి, ఐరన్ కలిగిన ఆహారాలను అతిగా తీసుకోవాల్సి ఉంటుంది. జింక్ అధికంగా ఉన్న ఆహారలు తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
జింక్ లోపం సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ 11 mg జింక్ తీసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ప్రతి రోజూ ఈ కింది ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.
వేరుశనగ:
జుట్టు వేగంగా రాలడం వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా.. వేరుశెనగతో తయారు చేసిన ఆహారాలు ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది.
ఇందులో జింక్, విటమిన్ ఇ, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి వీటిని అతిగా తినడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
చిక్కుళ్ళు:
గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారు ప్రతి రోజూ చిక్కుళ్ళు పప్పులను అతిగా తినడానికి ఇష్టపడతారు.
ప్రతి రోజూ రోజువారీ ఆహారంలో చిక్కుళ్ళు తీసుకోవడం వల్ల జుట్టు రాలడం వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
పుట్టగొడుగులు:
పుట్టగొడుగులు ఖరీదైనవి కావొచ్చు.. కానీ ఇవి శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది. అంతేకాకుండా జుట్టు రాలడాన్ని అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
ఇందులో ప్రోటీన్, పొటాషియం, భాస్వరం, కాల్షియం అధిక పరిమాణాల్లో లభిస్తాయి. కాబట్టి జుట్టుకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది.
0 Comments:
Post a Comment