Good News - Petrol - గుడ్ న్యూస్: భారీగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు: అక్కడే మెలిక పెట్టిన కేంద్రం..!!
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్ ఈ నెల 18వ తేదీన భేటీ కానుంది. ఇది 49వ సమావేశం. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ దీనికి అధ్యక్షత వహించనున్నారు.
చివరిసారిగా గత ఏడాది డిసెంబర్ 17వ తేదీన జీఎస్టీ కౌన్సిల్ సమావేశమైంది. దాని తరువాత మళ్లీ ఇప్పుడే భేటీ కానుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో సమర్పించిన నేపథ్యంలో ఏర్పాటు కానున్న ఈ కౌన్సిల్ సమావేశంపై ప్రస్తుతం అందరి దృష్టీ నిలిచింది.
బేస్ పెంపుపై కసరత్తు..
ఈ జీఎస్టీ కౌన్సిల్ అజెండాలో కొన్ని కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశాలు లేకపోలేదు. జీఎస్టీ బేస్ పెంపుదలను మరింత పెంచడంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టింది. దీన్ని పెంచడం వల్ల నెలవారీ జీఎస్టీ వసూళ్లు భారీగా పెరుగుతాయని అంచనా వేస్తోంది. దేశంలో జీఎస్టీ అమలులోకి వచ్చిన తొలి రోజుల్లో నెలవారీ వసూళ్లు 40 నుంచి 50 లక్షల వరకు ఉండేది. బేస్ ను పెంచడం వల్ల ఇప్పుడు 1.4 కోట్ల రూపాయలకు పెరిగింది.
పెట్రోల్, డీజిల్ రేట్లపై..
దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు ఏ స్థాయిలో ఉన్నాయనేది ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేని అంశం. మెజారిటీ రాష్ట్రాల్లో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి వంద రూపాయలను దాటేసింది. డీజిల్ పరిస్థితీ అంతే. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలతో పోల్చుకుంటే మిగిలిన చోట్ల వాటి రేట్లు మరింత ఎక్కువగా ఉంటోన్నాయి.
పెట్రో ఉత్పత్తులనూ..
ఈ పరిణామాల మధ్య పెట్రో ఉత్పత్తులను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకుని రావాల్సి ఉంటుందనే డిమాండ్ ను కేంద్ర ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకుంది. పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి చేర్చాలనే విషయం పట్ల చాలాకాలం నుంచీ చర్చ జరుగుతోంది. దీనిపై నిర్మల సీతారామన్ సానుకూలంగా స్పందించారు. అక్కడే మెలిక పెట్టారు. పెట్రోల్, డీజిల్ అమ్మకాలను జీఎస్టీ పరిధిలోకి తీసుకుని రావడంపై రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాల్సి ఉంటుందని అన్నారు. రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరితే అది సాధ్యపడుతుందని తేల్చి చెప్పారు.
ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ భేటీలో..
ఇవ్వాళ నిర్మలా సీతారామన్- పీహెచ్‌డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రతినిధులతో ముఖాముఖి భేటీలో పాల్గొన్నారు. ఆమె ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ పై చర్చించడానికి ఏర్పాటు చేసిన సమావేశం ఇది. ఇందులో వారు లేవనెత్తిన పలు ప్రశ్నలకు నిర్మలా సీతారామన్ సమాధానాలను ఇచ్చారు.
ఎప్పుడైనా సరే..
రాష్ట్రాలు అంగీకరిస్తే- ఎప్పుడైనా సరే పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి తాము సిద్ధంగా ఉన్నామని నిర్మల సీతారామన్ తేల్చి చెప్పారు. ఇదే విషయాన్ని గతంలో పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ కూడా ప్రస్తాావించారు. దాన్నే నిర్మలా సీతారామన్ తాజాగా పునరుద్ఘాటించారు. పెట్రోల్, డీజిల్ నుంచి రాష్ట్రాలు ఆదాయాన్ని పొందుతోన్నాయని, దాన్ని కోల్పోవడానికి రాష్ట్రాలు అంగీకరించబోవనీ వ్యాఖ్యానించారు.
0 Comments:
Post a Comment