నిత్య జీవితంలో తీసుకునే వివిధ రకాల ఆహారపు అలవాట్ల కారణంగా కడుపు ఉబ్బడం, గ్యాస్ సమస్యలు వెంటాడుతుంటాయి. ఫలితంగా జీర్ణక్రియలో ఇబ్బంది ఏర్పడుతుంటుంది.
కొన్ని రకాల ఆహార పదార్ధాలు తినడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంటుంది. ఆ వివరాలు మీ కోసం..
జీర్ణ సంబంధ సమస్యలు, గ్యాస్, కడుపు ఉబ్బడం వంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే కొన్ని రకాల ఆహార పదార్ధాలకు దూరం పాటించాల్సి ఉంటుంది.
ఎందుకంటే తినే ఆహారంలోని కొన్ని రకాల పోషకాల వల్ల సమస్యలు పెరుగుతాయి. బ్లోటింగ్, గ్యాస్ వంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు ఎలాంటి పదార్ధాలకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం..
పాల ఉత్పత్తులు
పాలతో తయారయ్యే వస్తువులు కడుపు ఉబ్బరానికి కారణమౌతుంటుంది. కడుపు ఉబ్బడం లేదా బ్లోటింగ్ సమస్యలుంటే కొన్ని వస్తువులకు దూరంగా ఉండాల్సిందే.
పాల ఉత్పత్తుల్లో ఉండే ల్యాక్టోజ్ ఇంటోలరెంట్ అనేది జీర్ణక్రియ శక్తి సాధ్యం కాదు. జీర్ణక్రియ సంబంధిత సమస్యలుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పాల ఉత్పత్తులు తినకూడదు.
బ్రోకలీ
బ్రోకలీ అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇందులో పలు పోషక పదార్ధాలుంటాయి. ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ కడుపు ఉబ్బరం సమస్య ఉంటే మాత్రం బ్రోకలీ తీవ్ర నష్టం కల్గిస్తుంది. జీర్ణక్రియ బలహీనంగా ఉన్నప్పుడు బ్రోకలీకు దూరంగా ఉండాలి.
వెల్లుల్లి
వెల్లుల్లి జీర్ణక్రియకు చాలా ప్రయోజనకరం. కానీ గ్యాస్ సమస్యను పెంచుతుంది. అందుకే కడుపు ఉబ్బరం సమస్య ఉండటం వల్ల వెల్లుల్లికి దూరంగా ఉండాలి. వెల్లుల్లిలో ఉండే ఫ్రుక్టోన్ కడుపులో గ్యాస్ సమస్యను పెంచుతుంది.
బీన్స్
బీన్స్ జీర్ణమవడం కష్టమే. ఇందులో ఉండే పోషక పదార్ధాలు జీర్ణమయ్యేందుకు కొద్దిగా సమయం పడుతుంది. అందుకే కడుపు ఉబ్బరం వంటి సమస్యలున్నప్పుడు బీన్స్‌కు దూరంగా ఉండాలి. బీన్స్ తినడం వల్ల గ్యాస్ , కడుపు ఉబ్బరం సమస్యలు పెరగవచ్చు.
ఉల్లిపాయలు
ఉల్లిపాయల్లేకుండా ఏ ఆహారం తయారు కాదు. దాదాపు అన్ని కూరల్లో ఉల్లిపాయ వినియోగం తప్పనిసరిగా ఉంటుంది. ఉల్లి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది.
ఇందులో చాలా పోషక పదార్ధాలుంటాయి. ఉల్లిపాయలో ఉండే లిక్విఫైడ్ ఫైబర్ మాత్రం కడుపులో స్వెల్లింగ్ సమస్యను పెంచుతుంది.
యాపిల్
యాపిల్ ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజూ ఒక యాపిల్ తింటే ఏ విధమైన రోగం దరిచేరదని వైద్యులు చెబుతుంటారు.
చాలా వ్యాధులకు యాపిల్ మంచి పరిష్కారమౌతుంది. కానీ జీర్ణక్రియకు యాపిల్ మంచిది కాదు. బ్లోటింగ్ సమస్య ఉంటే యాపిల్‌కు దూరంగా ఉండాలి.
0 Comments:
Post a Comment