February 1st: ప్రతినెల మెుదటి తారీఖున చాలా విషయాల్లో మార్పులు వస్తుంటాయి. కొన్ని రూల్స్ కూడా మారుతుంటాయి. ఈ క్రమంలో అవి మన జేబులను ఎలా ప్రభావితం చేస్తున్నాయనే విషయాన్ని కూడా గమనించాల్సి ఉంటుంది.
బ్యాంకింగ్ నుంచి ప్రభుత్వం తెచ్చే మార్పుల వరకు అనేక అంశాల్లో వచ్చిన మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బడ్జెట్ 2023..
ముందుగా ఫిబ్రవరి మెుదటి రోజు అనగానే మనందరికీ గుర్తొచ్చే అంశం కేంద్ర బడ్జెట్. ప్రభుత్వం ప్రజలకు, వ్యాపారులకు ఎలాంటి ప్రయోజనాలను కల్పిస్తుందనేది చాలా మంది ఆసక్తిగా ఎదురుచూసే అంశం.
త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు రానున్న తరుణంలో ఎలాంటి తాయిలాలు ప్రభుత్వం ప్రజలకు ఆఫర్ చేస్తుందనేది చాలా మంది ఎదురుచూస్తున్నారు.
బ్యాంకింగ్ న్యూస్..
ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి టాటా మోటార్స్ తన కార్ల ధరలను పెంచుతోంది. దీనివల్ల డీజిల్, పెట్రోల్ కార్ల ధరలు దాదాపుగా 1.2 శాతం మేర పెరుగుతాయని తెలిపింది.
ఇదే సమయంలో బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ ద్వారా ఇంటి అద్దె చెల్లింపులపై 1 శాతం ఛార్జీలను వసూలు చేస్తున్నట్లు వెల్లడించింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వార్షిక లెండింగ్ రేట్లను పెంచింది. ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్ పెంచిన వడ్డీ రేట్లను అమలులోకి తీసుకొస్తోంది.
ఫిబ్రవరి 13 నుంచి కెనరా బ్యాంక్ తన డెబిట్ కార్డ్ వార్షిక ఛార్జీలను రూ.200లకు పెంచాలని నిర్ణయించింది. అలాగే ప్లాటినమ్, బిజినెస్ కార్డుల ఛార్జీని రూ.500 చేసింది.
గోవా రూల్స్..
యువత ఎంజాయ్ చేయటానికి బెస్ట్ డెస్టినేషన్లలో ఒకటి గోవా. గోవా అనగానే అందమైన బీచ్ లతో పాటు తక్కువ ధరకు లభించే మద్యం గుర్తుకొస్తుంది. అయితే ఇకపై అక్కడికి వెళ్లేవారు కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి.
తాజా రూల్స్ ప్రకారం పర్యాటకులు ఉండే బీచ్ లలో వ్యక్తుల అనుమతి లేకుండా వారి ఫోటోలు తీయకూడదు.
పైగా బీచ్ లలో మద్యం సేవించటం, వంట చేయటం వంటి వాటికి అక్కడి ప్రభుత్వం నిషేధించింది. ఈ రూల్స్ అతిక్రమించే వారిపై రూ.50,000 జరిమానా విధించనున్నట్లు అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది.
గ్యాస్ సిలిండర్ ధర..
సాధారణంగా ప్రతి నెల మెుదటి రోజున దేశంలోని చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ల ధరల్లో మార్పులు చేస్తుంటాయి. గ్యాస్ ధరలను తగ్గించటం లేదా పెంచటం వంటి నిర్ణయాలు వెలువడుతుంటాయి.
అయితే నేడు కేంద్ర బడ్జెట్ ఉన్నందున కంపెనీలు రేట్లలో ఎలాంటి మార్పులు ప్రకటించలేదు. గతంలో పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే.. బడ్జెట్ సమావేశాల తర్వాతే గ్యాస్ ధరల్లో మార్పులను చమురు కంపెనీలు ప్రకటించాయి.
0 Comments:
Post a Comment